YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణ బీజేపీ స్ట్రాటజీ సెగలు

తెలంగాణ బీజేపీ స్ట్రాటజీ సెగలు

తెలంగాణ బీజేపీ స్ట్రాటజీ సెగలు
హైద్రాబాద్, నవంబర్ 25
తెలంగాణలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తోంది. తెలంగాణలో నాలుగు పార్లమెంటు స్థానాలను గెలుచుకోవడంతో మరింత ఆత్మవిశ్వాసంతో ఆ పార్టీ నేతలున్నారు. అయితే కేంద్ర నాయకత్వం ఆలోచనలకు భిన్నంగా ఇక్కడ రాష్ట్ర నాయకత్వం వ్యవహరించడం లేదు. కొత్తగా వచ్చిన వారికి పార్టీలో దక్కుతున్న ప్రాధాన్యత తమకు దక్కడం లేదని బీజేపీలో తొలి నుంచి ఉంటున్న వారు ఆవేదన చెందుతున్నారు. ఆవేదన మాత్రమే కాదు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు.సహజంగా ఏ పార్టీలో అయినా కోర్ కమిటీ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. కోర్ కమిటీ ఎప్పటికప్పుడు సమావేశమై పార్టీ స్ట్రాటజీలను నిర్ణయిస్తుంది. ప్రభుత్వంపై పోరాటం కావచ్చు. ప్రజాసమస్యలపై ఆందోళనలు కావచ్చు. పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు. ఇలా కోర్ కమిటీకి ఏ పార్టీలోనైనా అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఏ నిర్ణయం అమలు చేయాలన్నా కోర్ కమిటీ ఆమోదం తప్పనిసరి. ఇప్పుడు బీజేపీలోనూ కోర్ కమిటీలో కొత్త నియామకాలు అంతర్గత పోరుకు దారి తీస్తున్నాయి.తెలంగాణ బీజేపీలో కొత్తగా చేరిన వారికి కోర్ కమిటీలో చోటు కల్పించడంపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొహం మీదే కొందరు కడిగిపారేస్తున్నారు. తెలంగాణ బీజేపీ కోర్ కమిటీలో కొత్తగా పార్టీలో చేరిన పొంగులేటి సుధాకర్ రెడ్డి, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, వివేక్, పెద్దిరెడ్డి, గరికపాటి రామ్మోహనరావులకు చోటు కల్పించారు. ఇప్పుడు ఇదే తెలంగాణ బీజేపీలో ఆగ్రహావేశాలకు కారణమయింది. సీనియర్ నేతలను, పార్టీని ఎప్పటి నుంచో అంటిపెట్టుకుని ఉన్న నేతలను కాదని, సిద్ధాంతాలు లేని, స్వప్రయోజనాల కోసమే చేరిన వారికి నిర్ణయాధికారం కల్పించే వీలు ఎలా కల్పిస్తారని పలువురు సూటిగా ప్రశ్నిస్తున్నారు.ఇప్పుడు అసంతృప్త నేతలను బుజ్జగించడం బీజేపీ నేతల వల్ల కావడం లేదు. దీనికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కారణమంటూ కొందరు ఇప్పటికే కేంద్ర నాయకత్వానికి ఫిిర్యాదు చేసినట్లు తెలిసింది. సీనియర్ నేతలైన చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ లాంటి నేతలను కాదని వారిని ఎలా తీసుకున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. కొందరు లక్ష్మణ్ ను ఈ విషయంపై నిలదీసినా ఆయన నుంచి మౌనమే సమాధానం వచ్చిందట. కేంద్ర నాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే తాను నడుచుకున్నానని లక్ష్మణ్ సన్నిహితుల వద్ద చెబుతున్నా కోర్ కమిటీలో కొత్త నాయకుల చేరిక వ్యవహారం పార్టీ కొంప ముంచేలా ఉందంటున్నారు.

Related Posts