శ్రీశైలంలో భక్తుల రద్దీ
కర్నూలు
కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శ్రీశైలం, మహానంది, యాగంటి క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
శ్రీశైలానికి భారీగా భక్తుల రద్దీ పెరిగింది. భారీగా శ్రీశైలం చేరుకున్న భక్తులు, పాతాళ గంగలో పుణ్యస్నానాలు చేసారు. గంగాధర మండపం నాగుల కట్ట వద్ద దీపాలను వెలిగించారు. భక్తుల రద్దీ దృష్ట్యా సోమవారం, మంగళవారం ఆర్జిత సేవలను రద్దుచేసారు. సోమవారం మాత్రమే ఐదు విడతలుగా విఐపి బ్రేక్ దర్శనాలు కల్పించారు..