చెరువు కట్ట తెగింది. పలు ప్రాంతాలు నీట మునిగాయి
బెంగళూరు
అధికారుల అనాలో చిత నిర్ణయాలతో కన్నడ ప్రజలకు తిప్పలు తప్పడంలేదు. ఏదైనా పరిణామం ఎదురైతే తప్ప స్పందించరు. ఇదే ఇప్పుడు జల గండానికి కారణమైంది. పెద్ద చెరువుల్లో ఒకటైన హులిమావు కట్ట తెగింది. దింతో భారీ నీరు పొంగడంతో ప్రజలను నీటి సమస్యల పాల్చేసింది. చివరకు అధికారులు పరుగులు తీశారు.బెంగళూరు ప్రజలు ఒక్కసారిగా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. భయాందోళనలకు గురయ్యారు. ఉరుము లేని పిడుగులాగా ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. బెంగళూరులోని హులిమావు, బీటీఎం లేఅవుట్ పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటన ఇది. ఉద్యాననగరిగా పేరున్న బెంగళూరులోని అతి పెద్ద చెరువుల్లో ఒకటైన హులిమావు కట్ట తెగింది.కొద్దిరోజుల కిందట కురిసిన భారీ వర్షాలతో నిండుగా ఉన్న హులిమావు చెరువు కట్ట ఒక్కసారిగా తెగిపోవడంతో.. నీళ్లన్నీ వీధుల్లోకి పోటెత్తాయి. జనవాసాలను ముంచెత్తాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే బృహత్ బెంగళూరు మహానగర అధికారులు హులిమావు చెరువు వద్దకు చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను మోహరింపజేశారు.
బెంగళూరులో సుమా రు 140 ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ హులిమావు చెరువు.అయితే కొద్దిరోజుల కిందట బెంగళూరులో కురిసిన భారీ వర్షాలకు జలకళను సంతరించుకుంది. వర్షాల ధాటికి చెరువు మొత్తం నిండిపోయింది. ఇలాంటి స్థితిలో చెరువులో పూడిక తీత పనులకు దిగారు బీబీఎంపీ అధికారులు.ఉదయం నుంచి ప్రత్యేక యంత్రాలను తరలించారు. వాటిని చెరువులో దింపి పూడిక తీత పనులను ఆరంభించారు అధికారులు.