YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

గ్యాస్ ట్యాంకర్ బోల్తా…డ్రైవర్ కు గాయాలు

గ్యాస్ ట్యాంకర్ బోల్తా…డ్రైవర్ కు గాయాలు

గ్యాస్ ట్యాంకర్ బోల్తా…డ్రైవర్ కు గాయాలు
రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద ఎల్ పిజి గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో డ్రైవర్ కు సల్ప గాయాలు అయ్యాయి. 
శంషాబాద్ మండలం  బుర్జుగడ్డ తాండా సమీపంలో ఎల్ పిజి గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి డివైడర్ ను డికొట్టి బోల్తా కోట్టింది.  ట్యాంకర్ లో నిండుగా గ్యాస్ ఉండడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. 
చెన్నై నుండి హైదరాబాద్ వైపు నిండు గ్యాస్ లోడ్ తో భయలుదేరిన ట్యాంకర్ శంషాబాద్ బుర్జుగడ్డ తాండావద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్ ను డికొట్టి రోడ్డుకు అడ్డంగా బోల్తా కొట్టింది.విషయం తెలుసుకున్న శంషాబాద్ రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను  తెలుసుకున్నారు. ప్రమాదం ఎలా జరిగింది అతివేగమా మద్యం మత్తులోనా అనే కోణంలో కూడా పోలీసులు అరా తీసారు. 

Related Posts