YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా శ్రీ కాలభైరవస్వామివారి హోమం

శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా శ్రీ కాలభైరవస్వామివారి హోమం

శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా శ్రీ కాలభైరవస్వామివారి హోమం
తిరుపతి 
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో హోమ మహోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ కాలభైరవస్వామివారి హోమం వైభవంగా జరిగింది.        ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజ, అష్టభైరవ హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, కలశాభిషేకం, నివేదన, హారతి నిర్వహించారు. 
సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు శివపార్వతుల దివ్యకల్యాణ మహోత్సవం వైభవంగా జరుగనుంది. అనంతరం శ్రీ చండికేశ్వరస్వామివారి కలశస్థాపన, లఘు పూర్ణాహుతి, విశేష దీపారాధన నిర్వహించారు. 
 నవంబరు 26వ తేదీ మంగళవారం శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం జరుగనుంది. గృహస్తులు రూ.500/- చెల్లించి టికెట్ కొనుగోలు చేసి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు

Related Posts