రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో వేరుశనగ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి
ఏపీ రైతు సంఘం డిమాండ్
అనంతపురం నవంబర్ 25,
అరకొర వర్షాలతో రైతులు పండించిన వేరుశనగ పంటను సరైన ధరకు అమ్ముకోలేక దళారుల చేతుల్లో మోసపోతున్నారని ఏపీ రైతు సంఘం రాప్తాడు మండల అధ్యక్షుడు పోతలయ్య కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఇన్ చార్జ్ తాహాసిల్దార్ వరప్రసాద్ కి అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వేరుశనగ పంటకు 5,090 ధర నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వాలు బోనస్ ప్రకటించలేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ప్రకటించి, వేరుశనగ క్వింటాలు 5,590 ధర తో రైతుల నుండి కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని, రాప్తాడులో వేరుశెనగ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.