రొయ్యలను విడుదల చేసిన మంత్రి
వనపర్తి నవంబర్ 25,
ఖిల్లా ఘణపురం గణపసముద్రం చెరువులో లక్షా 10 వేల నీలకంఠ మంచినీటి రొయ్యలను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ శ్వేతా మహంతి, అధికారులు హజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ ఆధునిక చేపల మార్కెట్లు నిర్మిస్తామని అన్నారు. తెలంగాణ ప్రజలకు చేపలతో పాటు రొయ్యలు అందుబాటులోకి తెస్తామని అన్నారు. అవకాశమున్న అన్ని చెరువులలో దశలవారీగా రొయ్యలు విడుదల చేస్తాం. సమైక్య రాష్ట్రంలో వట్టిపోయిన చెరువులు ఇప్పుడు అలుగు పారుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ రి పట్టుదలకు ఇది నిదర్శనమని అన్నారు. ఉచిత చేప పిల్లల విడుదలతో మత్య్యకార కుటుంబాలలో ఆర్థిక స్వావలంబన గా వుంటుంది. అన్ని రంగాలలో ప్రగతి సాధిస్తున్న తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ ముందుచూపుతోనే ఇది సాధ్యమయింది. వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు వచ్చాయని అన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుభీమా పథకాలు దేశానికే ఆదర్శమని అన్నారు.