ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
హైదరాబాద్
నగరంలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడుతున్న పాత నెరస్తుడు యాదగిరి ని చైతన్య పురి పోలీసులు.అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. చైతన్య పురి పోలీస్ స్టేషన్ పరిధి నాగోల్ చౌరస్తా లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా ఉన్న వాహనదారుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అతడు నాగర్ కర్నూలు జిల్లా , రామిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన యాదగిరి ( 33 ) సంవత్సరాలు , ఇతడిపై చైతన్య పురి లిమిట్స్ లో 3 కేసులు , సరూర్ నగర్ లో 1 కేసు , మీర్ పేట్ లిమిట్స్ లో 1 కేసు , సైదాబాద్ లో 1 కేసు , చాదర్ ఘాట్ లో 1 కేసు , ఆమన్ గల్లు లో 1 కేసు , ఎల్బీనగర్ లో 1 కేసు , కంచన్ బాగ్ లో 1 కేసు గా ఉన్నట్లు గుర్తించారు.
నిందితుడినుంచి సుమారు ఐదు లక్షల రూపాయల విలువ చేసే 10 ద్విచక్ర వాహనాల ను స్వాధీనం చేసుకుని అతడిపై కేసు నమోదు చేసి , రిమాండ్ కు తరలించామని , గతంలో పలు పోలీస్ స్టేషన్ లలో ఇతడిపై 19 కేసులు నమోదుకగా జైలుకు వెళ్లొచ్చి , మళ్ళీ ఈవిధంగా జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నాడని ఇతడి నేర చరిత్ర గురించి మొత్తం విచారణ చేసిన అనంతరం అతడిపై పీడీ యాక్ట్ కుడా నమోదు చేసే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.