వ్యవసాయానికి వెన్నెముకగా నిలుస్తున్న ప్రభుత్వ పథకాలు
- మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి
తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకాలు వ్యవసాయానికి వెన్నెముకగా నిలుస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కులను అందజేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అసంఘటిత కార్మికులకు కేసీఆర్ సర్కార్ అండగా ఉందని, 2015 నుండి రాష్ట్రంలో అమలవుతున్న పథకానికి ప్రభుత్వమే బీమా సొమ్ము చెల్లించి బాధితులకు బీమా డబ్బు లను అందించడం జరుగుతుందని అన్నారు.2015 నుండి ఇప్పటివరకు ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు దాదాపు 13.5 కోట్ల ప్రమాద బీమా చెల్లింపు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ
బీమా లో నమోదు చేసుకున్న కార్మికులందరికీ భీమ వర్తిస్తుందిదని, అన్ని వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ, గొల్ల కురుమ ఆర్థిక పరిపుష్టికి సబ్సిడీ గొర్రెల పంపిణీ చేయడం జరిగిందని ఆయన అన్నారు. అచ్చంపేట మండలం అయివోలు గ్రామానికి చెందిన కృష్ణయ్య భార్య చనిపోవడంతో ఆటో నడుపుతూ పిల్లలు పోషిస్తున్న అతను దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో అతను కూడా మృతి చెందడం జరిగిందని, అందుకు గాను కృష్ణయ్య పిల్లలకు ఐదు లక్షల ప్రమాద బీమా చెక్కులను అందజేస్తున్నామని ఆయన భీమ చెక్కు 500000 వారికి అందజేశారు. అనంతరం మంత్రి జిల్లాలో నిర్మాణమవుతున్న పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్మిక విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి దాసు, జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, టిఆర్ఎస్ నేతలు కోళ్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు