YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు మంగళవారానికి తీర్పు వాయిదా

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు మంగళవారానికి తీర్పు వాయిదా

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు
మంగళవారానికి తీర్పు వాయిదా
న్యూఢిల్లీ 
 మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై వాదనలు విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పును మంగళవారానికి కి వాయిదా వేసింది.  మంగళవారం  ఉదయం 10:30 గంటలకు తీర్పు వెలువరించనుంది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం వాదనలు విన్నది.  మహారాష్ట్ర సీఎం తరఫున ముకుల్ రోహత్గీ, గవర్నర్ కార్యదర్శి తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, కాంగ్రెస్ తరఫున కపిల్ సిబల్, ఎన్సీపీ తరఫున అభిషేక్ సింఘ్వి, అజిత్ పవార్ తరఫున మనీందర్ సింగ్ వాదనలు వినిపించారు. బలపరీక్షకు 3-4 రోజులు గడువు కావాలని బీజేపీ కోరగా.. మంగళవారం నాడే బలపరీక్ష నిర్వహించాలని కాంగ్రెస్, ఎన్సీపీ గట్టిగా కోరాయి. ఎన్సీపీ తరఫున అభిషేక్ సింఘ్వి వాదిస్తూ ఎన్సీపీ నేతలు బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు కవరింగ్ లెటర్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో బీజేపీ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుందన్నారు. ఫడణవీస్కు ఇవాళ మెజార్టీ ఉందా అని జస్టిస్ సంజీశ్ ఖన్నా ప్రశ్నించారు. గతంలో 24 గంటల్లోనే బలపరీక్ష నిర్వహించారని ఖన్నా గుర్తుచేశారు. రాజ్ భవన్లో కాదు సభలో బలపరీక్ష జరగాలని ఖన్నా వ్యాఖ్యానించారు.  బలనిరూపణతోనే దేవేంద్ర ఫడణవీస్కు మెజార్టీ ఉందా లేదా అనేది తెలుస్తుందని సుప్రీం కోర్టు పేర్కొంది.  ఫిరాయింపులను అడ్డుకోవాలంటే తక్షణమే బలపరీక్షను నిర్వహించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. మెజార్టీ తేలేదీ గవర్నర్ వద్ద కాదని.. అసెంబ్లీలో మాత్రమేనని కోర్టు స్పష్టం చేసింది.  విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు... తీర్పును రిజర్వ్ లో ఉంచింది.

Related Posts