టీడీపీ హయంలోనే అనంత అభివృద్ది
అనంతపురం
అనంత అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. అనంతపురంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి నియోజకవర్గానికి చేసింది శున్యమని విమర్శించారు. ఆరు నెలల్లో అండర్ డ్రైనేజీ తెస్తామని హామీ ఇచ్చి.. ఎమ్మెల్యే మరిచారని, ప్రభుత్వం ఏర్పడి ఆరు మాసాలు అయినా ఎక్కడా నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి జరగలేదని ప్రభాకర్ చౌదరి ఆరోపించారు.అవినీతి జరిగి ఉంటే విచారణ జరిపించాలని అన్నారు.