కోర్టు సూచనల మేరకు….
ఆర్టీజీ ఐకాస నేతలు
హైదరాబాద్
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు సూచనల మేరకు నడుచుకుంటామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో రాజకీయ పార్టీల నేతలతో సోమవారం నిర్వహించిన జేఏసీ సమావేశం ముగిసింది. భేటీలో జేఏసీ నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈసందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ… 52రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఢిల్లీ వెళ్తే.. జంతర్ మంతర్ వద్ద ధర్నాకే వెళ్తామన్నారు. తమ నిర్ణయానికి సంబంధించిన లేఖను ఆర్టీసీ ఎండీకి పంపామన్నారు. మరోసారి ఆర్టీసీ జేఏసీ నేతల భేటీ ఉంటుందన్నారు. ఈ సమావేశానికి జేఏసీ నాయకులు అశ్వద్ధామ రెడ్డి, రాజి రెడ్డి, సుధ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, వామపక్ష నేతలు తమ్మినేని వీరభద్రం, పోటు రంగారావు తదితరులు హాజరయ్యారు.