YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కమలాపూర్ పీహెచ్సీని పరిశీలించిన కలెక్టర్

కమలాపూర్ పీహెచ్సీని పరిశీలించిన కలెక్టర్

కమలాపూర్ పీహెచ్సీని పరిశీలించిన కలెక్టర్
రికార్డుల విషయంలో మండిపాటు
వరంగల్ అర్బన్, :
జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న మెడిసిన్స్  స్టాక్ లను తనిఖీ చేయించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె.పాటిల్ ప్రకటించారు. సోమవారం కమలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి మెడిసిన్స్ స్టాక్ ను తనిఖీ చేశారు. రికార్డులలో 200 సెలైన్ బాటిల్స్ ఉంటే 88 మాత్రమే వాస్తవంగా కనిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం  చశారు. ఒకే మెడిసిన్ 15 వేలు నిల్వ ఉండడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కమలాపూర్ పి.హెచ్.సి.లోని మెడిసిన్స్ స్లాక్ లను బ్యాచ్ లు, ఇండెంట్ వారీగా సమగ్రంగా తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని డి.ఎం.అండ్ హెచ్ఓ. హరీష్ రాజ్, వైద్య, శాఖ మౌళిక వసతుల విభాగం ఇఇ-నర్సింహారావులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం లక్షల వ్యయంతో మెడిసిన్స్ సరఫరా చేస్తుంటే, సరైన రికార్డులను నిర్వహించటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోని  అన్ని రికార్డులను తనిఖీ చేశారు.  రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని అభిప్రాయపడ్డారు. జనరల్ ఓ.పి.రిజిష్టర్ లో సరైన ఎంట్రీలు వేయాలని సూచించారు. ఎ.ఎం.సి., ఇ.డి.డి, హైరిస్క్ కేసులు, ఇమ్యూనైజేషన్, కె.సి.ఆర్. కిట్ పంపిణీ, ఇన్ పేషెంట్ రిజిష్టర్లను తనిఖీ చేశారు. 

Related Posts