అవినీతిపై ఫిర్యాదులకు కాల్ సెంటర్
అమరావతి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతిపై ఫిర్యాదులకు కాల్ సెంటర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. సంబంధిత పోస్టర్ ను కుడా అయన విడుదల చేసారు. ఎవరైనా లంచం అడిగితే 14400కి కాల్ చేయొచ్చని సీఎం జగన్ అన్నారు. కాల్ సెంటర్ కు నేరుగా సీఎం జగన్ ఫోన్ చేశారు. కాల్ సెంటర్ పనితీరు, వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఫిర్యాదులైనా 15రోజుల్లో పరిష్కరించాలన్నారు.ఈ టోల్ఫ్రీ నంబర్ ద్వారా వచ్చే ఫిర్యాదులను ఇంటలిజెన్స్, ఏసీబీ అధికారులు స్వయంగా పర్యవేక్షించనున్నట్లు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల అవినీతిపై ఫిర్యాదులు అందితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు రుజువైతే నేరుగా ఇంటికి పంపేందుకు కూడా వెనుకాడేది లేదని ప్రభుత్వం ఇదివరకే స్ఫష్టం చేసింది.