మహారాష్ట్ర రాజకీయంలో మరో కీలక పరిణామం బలపరీక్షకు వేదిక కాబోతున్న రాజ్ భవన్
ముంబై :
మహారాష్ట్ర రాజకీయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం అనూహ్యంగా కొలువు తీరిన ఫడ్నవీస్ సర్కారు తన బలపరీక్ష విషయంపై దాఖలైన వాజ్యంపై సుప్రీం కోర్టు తన తీర్పును రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది.
మహారాష్ట్ర అసెంబ్లీలో 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ 105 స్థానాల్లో శివసేన 56 స్థానాల్లో ఎన్సీపీ 54.. కాంగ్రెస్ 44 స్థానాల్లో గెలవగా.. మిగిలిన స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి 145 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి 105 స్థానాలతో పాటు అజిత్ పవార్ చీల్చే ఎమ్మెల్యేలతో పాటు..ఇండిపెండెంట్లు ఉన్నారని చెబుతున్నారు. వాస్తవంలో మాత్రం అలాంటిది కనిపించట్లేదన్న వాదన కనిపిస్తోంది.అయితే.. బలపరీక్ష ఎప్పుడన్న విషయంపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయాన్ని వెలువరిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్టీలు ఇచ్చిన లేఖల ఆధారంగానే గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరినట్లు సొలిసిటర్ జనరల్ వాదించారు. మూడు పక్షాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. తమ తుది తీర్పును మంగళవారం ఉదయం 10.30 గంటలకు వెలువరిస్తామని పేర్కొన్నారు.