హిందూ ధర్మం గొప్పది.
అభినవ రాచోటి వీర శివాచార్య స్వామిజి.
ఘనంగా నవగ్రహ పూజ సర్వదేవతా హోమం.
శివాలయంలో ప్రత్యేక పూజలు
మంత్రాలయం
అన్ని ధర్మాలలో కెల్లా హిందూ ధర్మం గొప్పదని రాయచూరు పీఠాధిపతి అభినవ రాచోటి శవీరశివాచార్య స్వాములు భక్తులనుద్దేశించి ఉపదేశించారు. కార్తీకమాసం సోమవారం సందర్భంగా మంత్రాలయం పాత ఊరిలో వెలసిన శ్రీరామలింగేశ్వర స్వామి శివాలయంలో అర్చకులు శివునికి జలాభిషేకము, పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చకులు మృత్యుంజయ స్వామి, శివరాజ్ స్వామి ఆధ్వర్యంలో నవగ్రహ సర్వదేవతా హోమం అశేష భక్తజన వాహినికి మధ్య ఘనంగా నిర్వహించారు. హోమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై హోమాన్ని తిలకించారు. రామలింగేశ్వర స్వామి ఆలయానికి రాయచూరు మఠం పీఠాధిపతి అభినవ రాచోటి శ్రీవీర శివాచార్య స్వాములు ముఖ్య అతిథిగా హాజరై నవగ్రహ హోమంలో పాల్గొన్నారు.అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ భక్తులు అన్ని ధర్మాలలో కెల్లా హిందూ ధర్మం గొప్పది అని హిందూ ధర్మాన్ని పాటించాలని, ప్రజలు హిందూ ధర్మ ఆచారవ్యవహారాలను పాటించాలని సూచించారు. మంత్రాలయంలో శ్రీరాముడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్టా పించడం వల్ల శ్రీరామలింగేశ్వరుడు అని ప్రసిద్ధి చెందారని తెలియజేశారు. కార్తీక మాసంలో శివుని ఆరాధిస్తే సకల కోరికలు నెరవేరుతాయని భక్తులకు సెలవిచ్చారు. అనంతరం భక్తులకు ఫల మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. రామలింగేశ్వర స్వామి అర్చకులు,పండితులు,కారిక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.