YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

శ్రీ బాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలి

శ్రీ బాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలి

శ్రీ బాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలి
కర్నూల్:
రాయలసీమ హక్కుల పత్రం   శ్రీ బాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ జేఏసీ ఆధ్వర్యంలో కడప నుండి ప్రారంభమైన బైక్ యాత్ర కర్నూలుకు చేరుకుంది. జేఏసీ నేతలు రవి శంకర్ రెడ్డి, మల్లెల భాస్కర్ నేతృత్వంలో జరుగుతున్న బైక్ ఈ యాత్రకు కోనేటి వెంకటేశ్వర్లు, ఎం మోహన్ ఆధ్వర్యంలో కర్నూలు విద్యార్థి, ప్రజా సంఘాలు, న్యాయ వాదులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు, కన్వీనర్ ఎం మోహన్, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం వి ఎన్ రాజు యాదవ్, ఆర్ వి ఎస్ అధ్యక్షులు సీమ కృష్ణ, విద్యార్థి జేఏసీ నేతలు బి భాస్కర్ నాయుడు, వి.హరినాథ్ ఆచారి, న్యాయ వాదులు గోపాల కృష్ణుడు, వి నాగలక్ష్మి దేవి, వై జయ రాజు, మురళి మోహన్, ఆర్ నరసింహులు, రాయలసీమ హక్కుల ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి జీ మద్దిలేటి యాదవ్, ప్రజా సంఘాల నేతలు టి శేషిఫణి, డాక్టర్ పుల్లన్న, జీ అయ్యన్న యాదవ్, నక్కలమిట్ట శ్రీనివాసులు, కురువ రంగ స్వామి, రజక టీజీ శ్రీనివాసులు, విద్యా సంస్థల అధినేతలు టి చంద్ర శేఖర్, పి సాయి సుబ్బయ్య పాల్గోని బైక్ యాత్ర ఉద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 1953 నాటి ఆంధ్ర రాష్ట్రమే నేడు 2014 లో ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ అలాంటప్పుడు నాడు ఏదైతే కర్నూలు రాజధానిగా ఉండేదో నేడు అదే కర్నూలు రాజధానిగా ఉండాలి కానీ గత పాలకులు తాత్కాలిక రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసి రాయలసీమకు తీవ్ర అన్యాయం చేశారు. కనీసం హైకోర్టు కూడా రాయలసీమలో ఏర్పాటు చేయకుండా శ్రీ బాగ్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సీమ పై తీవ్ర వివక్షత చూపుతున్నారు.భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఒక్క పెద్ద జల ప్రాజెక్టు రాయలసీమలో నిర్మించలేదు, కాటన్ బ్యారేజి, నాగార్జున సాగర్, పట్టిసీమ, పోలవరం అన్ని కోస్తాలోనే కడుతున్నారు. ఇక ఎయిమ్స్, మెడికల్ కాలేజీలు, క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ అన్ని అక్కడకే తరలిస్తున్నారు. అందుకే రాయలసీమ సాధారణ ప్రజలను, రైతులను, కార్మికులను చైతన్యం చేసేందుకు సీమ హక్కుల సాధనే ధ్యేయంగా జరుగుతున్న బైక్ యాత్ర సీమ నాలుగు జిల్లాలలో పలు నియోజకవర్గాలు, పట్టణాలను కలుపుతూ చిత్తూరు జిల్లా మదనపల్లెలో భారీ బహిరంగ సభతో ముగుస్తుందని తెలిపారు.పాలకులు ఇప్పటికన్నా మేల్కొని శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయాలని, కృష్ణా తుంగభద్ర నది జలాలలో సీమకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, సిద్ధేశ్వరం వేదవతి, గుండ్రేవుల, ఆర్డీఎస్ ప్రాజెక్టులు తక్షణమే పూర్తి చేయాలని, జనాభా ప్రాతిపదికన రాయలసీమకు నీళ్లు, నిధులు, నియామకాలు, ప్రాజెక్టులు, విశ్వవిద్యాలయాలు, మెడికల్ కాలేజీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు తదితర అన్ని రంగాలలో రాయలసీమకు నలభై శాతం వాటా ఇవ్వాలని తాత్కాలిక రాజధాని అమరావతిని ఫ్రీజోన్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో షఫకత్, భగత్, విజయ్ కుమార్ యాదవ్, శేషు, శ్రీను, రాయలసీమ కమ్యునిస్ట్ పార్టీ నాయకులు, ఆర్.ఎస్.వై.ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts