మన స్వచ్చత- మన గౌరవం వైభవంగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన
పెద్దపల్లి నవంబర్ 25
మన స్వచ్చత – మన గౌరవం కార్యక్రమం జిల్లాలో వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన సంబంధిత అధికారులను ఆదేశించారు. ఐఈఎస్ , స్వచ్చ సుందర్ సముదాయ్ సౌచాలయ్ , తదితర అంశాల పై ఎంపిడిఒలు, తహసిల్దార్లు సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పంచసూత్రాల పై అవగాహన కల్పించే దిశగా ఎపిఎంలు పనిచేయాలని కలెక్టర్ సూచించారు. రెండు రోజులలో స్వశక్తి మహిళా సంఘాల సభ్యులను ఎంపిక చేసి , వారికి శిక్షణ అందించి పంచసుత్రాల అమలు జరిగేలా పర్యవేక్షించాలని కలెక్టర్ అన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంట్లో కాంపోస్ట్ పిట్ ఎర్పాటు చేసుకొని, దానిని సద్వినియోగం చేసుకొనే విధంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. గ్రామాల్లో ఎపిఎంలు చేస్తున్న పనిని ఎంపిడిఒలు ప్రతి రోజు పర్యవేక్షించాలని సూచించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో పూర్తి స్థాయిలో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసామని, వాటిని పరిశుభ్రంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. స్వచ్చ సుందర్ సముదాయ్ సౌచాలయ్ లో భాగంగా సామూహిక మరుగుదొడ్లకు నీటి సరఫరా, పేయింటింగ్స్, చుట్టు పూల మొక్కలు పెంచాలని కలెక్టర్ అన్నారు. గ్రామాల్లో ఐఈఎస్( ఇన్ఫర్మేషన్, ఎడ్యూకేషన్, కమ్యూనికేషన్) నిర్వహణ సమర్థవంతంగా చేయాలని, ప్రతి రోజు సాయంత్రం 5.30 గంటలకు ప్రజలను భాగస్వామ్యం చేస్తు ప్రోజక్టర్లను ఉపయోగించుకుంటూ అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లా అధికారులు, తహసిల్దార్లు, ఎంపిడిఒలు, జిల్లా అధికారులు సదరు కార్యక్రమాలో పాల్గోన్నాలని కలెక్టర్ ఆదేశించారు. స్థానిక సర్పంచ్, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని, గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులకు ఉదయం పాఠశాలలో అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. మన స్వచ్చత – మన గౌరవం కార్యక్రమంలో స్థానికంగా గ్రామంలో ఉన్న ప్రజల నైపుణ్యం ప్రదర్శించే అవకాశం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామానికి సంబంధించి వీడియోను తహసిల్దార్లు రెవెన్యూ సిబ్బందిని ఉపయోగించి తయారు చేయాలని, స్థానికంగా ఉన్న ప్రభుత్వ సంస్థలు, ప్రార్థన స్థలాలు, స్థానిక ప్రజల అభిప్రాయాల తెలుసుకుంటూ వీడియో రుపొందించి ప్రదర్శించాలని కలెక్టర్ సూచించారు. మన స్వచ్చత మన గౌరవం కార్యక్రమ షెడ్యుల్ వివరాలు పోలిసులకు అందించాలని కలెక్టర్ అన్నారు.
ఆత్మరక్షణ కొరకు ప్రత్యేక శిక్షణ
జిల్లాలోని బాలికలకు ఆత్మరక్షణ కొరకు ప్రత్యేకంగా శిక్షణ అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. కేరళ కు చెందిన కళరియపట్టు శిక్షణను డిసెంబర్ 1 నుంచి పాఠశాల శిక్షణ ప్రారంభమవుతుందని, ప్రతి పాఠశాలలో 22 రోజుల పాటు విద్యార్థులకు ఆత్మరక్షణ అందించడం జరుగుతుందని, మొత్తం 45 రోజుల్లో జిల్లాలోని ప్రతి పాఠశాలలో ప్రత్యేక శిక్షణ పూర్తి చేస్తామని తెలిపారు. ట్రైయినర్ కు సంబంధించి భోజన ఎర్పాట్లు, రవాణా సంబంధించి విషయాలు సమన్వయం చేసుకోవాలని తెలిపారు పెద్దపల్లి ఆర్డిఒ ఉపెందర్ రెడ్డి, జిల్లా ఇంచార్జి డిఆర్డిఒ చంద్రప్రకాశ్ రెడ్డి, జడ్పీ సీఈఒ వినోద్ కుమార్, జిల్లా పంచాయతి అధికారి వి.సుదర్శన్, జిల్లా అధికారులు, తహసిల్దార్లు, ఎంపిడిఒలు, సంబంధిత అధికారులు, తదితరులు ఈ సమావేశంలో పాల్గోన్నారు.