ప్లాస్టిక్ నిషేదం సంబంధించిన కరపత్రం ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి నవంబర్ 25
ప్లాస్టిక్ నిషేదించడం సంబంధించి కరపత్రం జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన సోమవారం ఆవిష్కరించారు. పెద్దపల్లి చెందిన పర్యావరణ మిత్రుడు వెన్నంపల్లి రవిందర్ ప్లాస్టిక్ భూతం నిషేదం సంబంధించి ప్రచురించిన కరపత్రం ఆవిష్కరించిన కలెక్టర్ , ప్లాస్టిక్ నిషేదం దిశగా అవగాహన నిర్వహిస్తున్నందుకుగాను అభినందించారు. పాలిథిన కవర్లు సుమారు 10 లక్షల కోట్ల పైనే సృష్టించామని, ఒక టన్ను పాలిథిన్ ఉత్పణ్తికి 11 బ్యారెళ్ల చమురు అవసరమవుతుందని, ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 10 లక్షల పాలిథిన్ కవర్లను వినియెగిస్తున్నామని, వీటిని మన దేశంలో పూర్తి స్థాయిలో నిషేదించామని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే ప్లాస్టిక్ నిషేదం సాధ్యమవుతుందని కలెక్టర్ తెలిపారు.జిల్లా ఇంచార్జి డిఆర్వో కె.నరసింహమూర్తి, ప్రచురణకర్త వెన్నంపల్లి రవిందర్, సంబంధిత అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.