YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఎంతోమంది సీఎంలను చూశాం

ఎంతోమంది సీఎంలను చూశాం

ఎంతోమంది సీఎంలను చూశాం
కడప నవంబర్ 25 
కూల్చివేతలు బెదిరింపులతో వైకాపా ప్రభుత్వ పాలన ప్రారంభమయిందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. సోమవారం అయన కడపలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. చంద్రబాబు మాట్లాడుతూ ప్రజా వేదిక కూల్చి స్వంత ఇంటికి  15కోట్లు ఎందుకు ఖర్చు చేశారో చెప్పాలి. ఆరు నెలల సమయం ఇచ్చినా సంక్షేమంపై దృష్టి సారించలేదని అన్నారు. 1983లో కడపలో గెలిచాం. రాష్ట్రంలోని నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి బెదిరింపులకు ప్రభుత్వం పాల్పడుతుందని అన్నారు. కడపలో దోరకని ఇసుక బెంగుళూరులో దోరుకుతోంది. ఎంతో మంది సిఎం లను చూశాం. వైసీపీ ప్రభుత్వం బెదిరింపులకు బెదిరేది లేదు. వరదలకు ఇసుక కోట్టుకుపోయిందని చెప్పడం సిగ్గుచేటు. ముప్పై ఐదు లక్షల కుటుంబాలకు జీవనోపాధి లేకుండా చేసిన ప్రభుత్వం ఇదని అన్నారు. ఇసుక కోసం వైసీపీ ప్రజాప్రతినిధులు పోట్లాడుకుంటున్నారు. మద్యపాన నిషేధమని చెప్పి మద్యం రేట్లను విపరీతంగా పెంచారు. రాష్ట్రంలో జగన్ టాక్స్ వసూలు చేస్తున్ఆనరు. బోటు వెలికి తీసిన దర్మాడి సత్యాన్ని అడిగితే వర్షాకాలంలో ఇసుక ఎలా తీయాలో చెబుతారని అయన సూచించారు. గ్రామ వాలంటీర్లుగా వైసీపీ కార్యకర్తలను నియమించారు. వైసీపీ ప్రభుత్వం పిచ్చి పరాకాష్టకు చేరింది. గాంధీ విగ్రహాలకు ప్రభుత్వ ఆస్తులకు వైసీపీ రంగులు వేస్తున్నారు. దోపిడీదారులుగా  వైసీపీ నేతలు మారారు. దేశం పార్టీలో ఉన్న బకాయిలను వసూలు చేయరా. మరి అలాంటప్పుడు టిడిపి హాయాంలో అమలు చేసిన పథకాలను ఎందుకు కోత పెట్టారని ప్రశ్నించారు. అమ్మ ఒడి పథకానికి అనేక అంక్షలు వున్నాయి. ఆరు నెలల్లో ఒక్క అభివృద్ధి పనైనా జరిగిందా.. రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక, విదేశీ విద్య ఎక్కడ అని అన్నారు. కడప జిల్లాను సశ్యశామలం చేశాం. గండికోట నిర్వాసితులకు ఆర్అండ్ ప్యాకేజీ ఇచ్చాం. ఆవుకు టన్నెల్ పూర్తి చేసి కడపకు నీళ్ళు ఇచ్చాం. నా ఇంటిని  ముంచాలని చూసారు. టీడీపీ హాయంలో చేసిన నీరు చెట్టు సత్పలితాలను ఇచ్చాయి. నదుల అనుసంధానం చేశాం. వరదలు వచ్చినా ప్రాజక్టుల్లో నీళ్ళు నింపుకోలేక విఫలమైన ప్రభుత్వం. కెసిఆర్ తో చెట్టపట్టాలేసుకు తిరిగారు. ఒక పద్దతిలో పాలన సాగడం లేదు. పిపిఎలు, రివర్స్ టెండరింగ్ లపై కేంద్రం హెచ్చరించినా పెడచెవిన పెట్టారని అన్నారు. వైఎస్ హాయాంలో ఎన్నో కేసులు పెట్టారు. కోర్టు నాకు క్లీన్ చిట్ ఇస్తే జగన్ కు మొట్టికాయలు వేస్తోంది. కడపలో ముఠా, దౌర్జన్యాలు తగ్గితేనే పెట్టుబడులు వస్తాయి. అదానీ, రిలయన్స్, వంటి ఎన్నో సంస్థలు వెనక్కి పోయాయి కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తే,  మళ్ళీ బ్రహ్మణి స్థానంలో ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేయడం దేనికి సంకేతమని అయన అన్నారు.

Related Posts