YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

రైతులకు న్యాయం జరగడంలేదు

రైతులకు న్యాయం జరగడంలేదు

రైతులకు న్యాయం జరగడంలేదు
హైదరాబాద్ నవంబర్ 25 
తెలంగాణ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుంది. రైతు రుణ మాఫీ గతంలో ఆరు సార్లు ఇచ్చి ఇబ్బందులు పెట్టారు. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ ఇంత వరకు రైతు అంశాలపై చర్చను లేదని   కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం. కోదండరెడ్డి అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. రైతు సమన్వయ సమితి విధానాలను తాము వ్యతిరేకించా. రైతు బంధు ఎన్నికలకే పరిమితం కాకుండా అందరూ రైతులకు ఇవ్వాలి. రాజకీయం కోసం కాకుండా రైతు ప్రయోజనం కోసం ఉపయోగకంగా ఉండాలి.  రెవిన్యూ రికార్డుల సవరణలో చాలా ఇబ్బందులు వచ్చాయి. మేము రాజకీయంగా మాట్లాడడంలేదు. రెండేళ్లు అయ్యింది, ఇంకా లక్షలాది మందికి పాస్ బుక్స్ రాలేదు. 11 లక్షల మంది బడుగులకు పుస్తకాలు రాలేదని అయన అన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన సంఘటపై ఇంతవరకు ప్రభుత్వం కారణం చెప్పలేదు. ఒక వృద్ధ దంపతులు రెవెన్యూ ఉద్యోగులకు లంచాలు ఇవ్వడానికి భిక్షాటన చేసారు. చిగురుమామిడి లో కనకయ్య అనే రైతు నిజమైన రైతు కు పాస్ పుస్తకం ఇవ్వడానికి లంచం తీసుకొని కూడా ఇవ్వకపోతే అత్మ హత్యచేసుకోవడానికే ప్రయత్నం చేస్తే ఆయన్ను జైల్లో పెట్టారు. మంత్రి కేటీఆర్ గారు రెవెన్యూ ఉద్యోగులకు భరోసా ఇచ్చారు కానీ రైతులకు ఎలాంటి న్యాయం చేయలేదు. లక్షల మంది రైతాంగ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఫలితం అనుభవిస్తారని అయన అన్నారు. 

Related Posts