ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం.. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్టు
న్యూ ఢిల్లీనవంబర్ 25
దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. ముగ్గురు ఉగ్రవాదులను ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. పేలుడు పదార్ధాలతో వారున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ ముగ్గురు తీవ్రవాదులు అస్సాం నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఐఈడీలతో ఉన్న ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు డీసీపీ ప్రమోద్ కుశ్వాహ్ తెలిపారు. అరెస్టు అయిన ముగ్గురూ అస్సాంలోని గోల్‌పారాకు చెందినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వారిని ఇస్లామ్, రంజీత్ అలీ, జమాల్‌గా గుర్తించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ మాడ్యూల్ నుంచి వారంతా ఇన్‌స్పైర్ అయినట్లు పోలీసులు చెప్పారు. గోల్‌పారాలో ఐఈడీలతో పేలుడుకు పాల్పడనున్నట్లు అనుమానించారు. ఢిల్లీలోనూ అదే తరహా దాడికి వాళ్లు ప్లానేసినట్లు పోలీసులు పసికట్టారు.