పసుపు జెండాతో జగన్ కు వణుకు
విజయవాడ నవంబర్ 25
పసుపు జెండా చూడగానే జగన్ ఎందుకు వణికిపోతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ర్ట అధ్యక్ష్యుడు కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కడప జిల్లా పర్యటన సంధర్బంగా పార్టీ శ్రేణులు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ప్లెక్సీలను తొలగించే అధికారం ఎవరిచ్చారని నిలదీసారు. సీఎం సొంత జిల్లాలో తెలుగుదేశంకు వస్తున్న ఆదరణ చూసి వైసీపీ హడలిపోతోంది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇతర పార్టీ జెండాలు, ప్లెక్సీలు కట్టడానికి వీల్లేదా. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షపార్టీలు సభలు, సమావేశాలు నిర్వహించే హక్కులేదా. ఇది ప్రజాస్వామ్యమూ ? లేక రాజరిక వ్యవస్ధా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వకార్యాలయాలకు, జాతీయ జెండా, మహాత్మా గాంధీ ని వదల కుండా వైసీపీ రంగులు వేస్తే నోరుమెదపని అధికారులు, తెలుగుదేశం ప్లెక్సీలను అనుమతి లేదంటూ తొలగించటం ఏంటని మండిపడ్డారు. అధికారులు ప్రభుత్వానికి తొత్తులగా పనిచేస్తున్నారా? ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు అన్న సంగతి అధికారులు గుర్తుంచుకోవాలని అయన అన్నారు.