YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆరు నెలల కాలంలో ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడం తప్ప వైసీపీ చేసిందేమీ లేదు

ఆరు నెలల కాలంలో ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడం తప్ప వైసీపీ చేసిందేమీ లేదు

ఆరు నెలల కాలంలో ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడం తప్ప వైసీపీ చేసిందేమీ లేదు
అమరావతి నవంబర్ 25 
సోమవారం మైలవరంలోని రైతు బజార్ ను మరియు మార్కెట్ యార్డ్ లను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించారు. మొదటగా రైతు బజార్ కి వెళ్ళిన దేవినేని అక్కడ  కూరగాయల ధరలపై వినియోగదారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. కూరగాయలు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని సామాన్య ప్రజలు కొనేటట్లు తినేటట్టు లేదని అరకొర సరుకులతో కాలం వెళ్లబుచ్చాల్సి వస్తుందని దేవినేని అన్నారు. ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడం తప్ప వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని దేవినేని అన్నారు.  గతంలో ఉల్లిపాయలు కోస్తుంటే కన్నీళ్లు వచ్చేవని నేడు ఉల్లిపాయల కొనాలంటే కన్నీళ్లు వస్తున్నాయని  అన్నారు. తన హయాంలో మైలవరం పట్టణంలో 375 పూరగుట్టలో 1100 పైగా ఇళ్ల పట్టాలను ఇచ్చామని ప్రస్తుత ఎమ్మెల్యే ఆరు నెలల నుంచి జి ప్లస్ త్రీ భవనాలు కడతామని బాహుబలి సినిమా చూపిస్తున్నాడని అన్నారు. గత ఎన్నికలలో కరెన్సీ నోట్లను చించి ఇబ్రహీంపట్నం, కొండపల్లిలతో సహా కొన్ని గ్రామాలలో పంచారని రిజర్వు బ్యాంక్ ముద్రించే నోట్లను  చించే  అధికారం అతనికి ఎవరిచ్చారని తన అనుచరులు నోట్లు పంచారా.. లేదా.. అని కృష్ణప్రసాద్ ని అడుగుతుంటే డొంకతిరుగుడు సమాధానాలు చెప్తున్నారని కరెన్సీ నోట్లు చించిన విషయంపై మాత్రం స్పందించడం లేదని దేవినేని అన్నారు. దేవినేని ఉమాను అసెంబ్లీకి రాకుండా చేయాలంటే కరెన్సీ నోట్లు చించి  ఇటువంటి హవాలా కార్యకలాపాలు మైలవరంలో ప్రవేశపెట్టాలా అని అన్నారు. మీ శాసనసభ్యుడు చేసిన పనిని మీరు సమర్ధిస్తున్నారో.. ఖండిస్తున్నారో జగన్మోహన్రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ఇళ్ల పట్టాలు రద్దు చేస్తే ఊరుకునే ప్రసక్తేలేదని పేదవాళ్లకు ఏ అన్యాయం జరిగినా  కూడా ప్రజల తరపున పోరాడి ప్రభుత్వం మెడలు వంచుతామని దేవినేని అన్నారు. అనంతరం మార్కెట్ యార్డ్ లో ఉన్న ఇసుక డంపింగ్ కేంద్రాన్ని సందర్శించిన దేవినేని చివరకు ఇసుకను మార్కెట్ యార్డ్ లో పెట్టి అమ్మటం సిగ్గుచేటని వెంటనే పేదలకు ఉచిత ఇసుక అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం పత్తి, మొక్కజొన్న, దాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన దేవినేని రైతులు దళారుల బారినపడి మోసపోవద్దని సూచించారు. మార్కెట్ యార్డ్ లో రైతులకు అవసరమైన ఏర్పాట్లను సౌకర్యాలను వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు.

Related Posts