YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఆర్టీసీ కార్మికులు అరెస్ట్

ఆర్టీసీ కార్మికులు అరెస్ట్

ఆర్టీసీ కార్మికులు అరెస్ట్
సత్తుపల్లి నవంబర్ 26 
ఆర్టీసి కార్మికుల సమ్మె విరమణ అనంతరం మంగళవారం  విధుల్లోకి చేరాలని కార్మికులు భావించటం తో అన్ని బస్ డిపో ల వద్ద,బస్ స్టాండ్ ల వద్ద పోలీస్ లు పటిష్ట బందోబస్తు ను ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసి డిపో వద్ద పోలీస్ సిబ్బంది భారీగా హరించారు.కల్లూరు ఎసిపి వెంకటేష్,సత్తుపల్లి సిఐ ఆధ్వర్యం లో సత్తుపల్లి పట్టణం లోని రింగ్ సెంటర్ లో అలానే బస్ స్టాండ్,డిపో ప్రాంగణం లో అర్థరాత్రి నుండే పోలీస్ లు పహరా కాసారు. ఉదయం 6 గంటలకు డిపో లకు చేరుకుని విధుల్లోకి చేరతామని ఆర్టీసి జెఏసి ప్రకటించటం ఇదే క్రమంలో లేబర్ కోర్టు లో కేసు తేలే వరకు ఎవ్వరినీ విధుల్లోకి తీసుకోమని ఆర్టీసి ఇంఛార్జ్ ఎండీ సునీల్ శర్మ తెలపటం తో ఆర్టీసి కార్మికులు ఎవ్వరినీ బస్ డిపో ల వద్దకు వెళ్లనియ్యకుండ సత్తుపల్లి బస్ స్టాండ్ ఇన్ గేట్,ఔట్ గేట్ లను భారికెడ్లతో పోలీస్ లు మూసి వేశారు. భారీగా మోహరించిన పోలీస్ లతో బస్ స్టాండ్ ప్రాంతం లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.విధుల్లోకి చేరటానికి వచ్చిన సుమారు 80 మంది ఆర్టిసి కార్మికులను వారికి మద్దతుగా వచ్చిన పలు పార్టీ నాయకులను ఎక్కడికి అక్కడే పోలీసులు అడ్డుకొని స్టేషన్ కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో రాని అనే ఓ మహిళ కండక్టర్ చేతికి గాయమై రక్తస్రావం అయింది.పలువురు అస్వస్థతకు గురయ్యారు. పోలీసుల అరెస్టులతో సత్తుపల్లి ఆర్టిసి బస్టాండ్ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.డిపో లోకి ప్రవేశిస్తున్న కార్మికులను పోలీస్ లు అడ్డుకుంటున్న ఎదో ఒక మార్గం లో కొంత మంది కార్మికులు డిపో గేట్ వద్ద కు చేరుకుని గేట్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.ఆందోళన చేస్తున్న కార్మికులను అరెస్ట్ చేసి డిసియం లో పోలీస్ స్టేషన్ కు తరలించారు. శాంతియుతంగా సమ్మె ను విరమించి విధుల్లోకి చేరాలని వచ్చిన తమను ఈ విధంగా అడ్డుకుని అక్రమం గా అరెస్ట్ లు చేయటం కరెక్ట్ కాదని వాపోయారు ఆర్టీసి కార్మికులు.సీయం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేపట్టారు.

Related Posts