YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

ఆర్టీసీ కార్మికులను అడ్డుకున్న పోలీసులు

ఆర్టీసీ కార్మికులను అడ్డుకున్న పోలీసులు

ఆర్టీసీ కార్మికులను అడ్డుకున్న పోలీసులు
భూపాలపల్లి నవంబర్ 26 
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గల ఆర్ టి సి డిపోలో కార్మికులు విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికుల ను పోలీసులు అరెస్ట్ చేసారు. ఆర్టీసీ జె ఏ సి సమ్మె విరమించి కార్మికులను షరతులు లేకుండా విధుల్లోకి తీసుకివాలని ఆర్టీసీ జెఏసి పిలుపునిచ్చిన నేపద్యంలో మంగళవారం  ఉదయం నుండే కార్మికులు విధుల్లోకి చేరేందుకు డిపోల వద్దకు చేరుకోగానే పోలీసులు వారిని అడ్డుకొని డిపోలోకి అనుమతి లేదు అని కార్మికులను అదుపులోకి తీసుకొని పోలిస్ స్టేషన్ కు తరలించారు. గత 54 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మిక జేఏసీ సమ్మె విరమించిన 
విషయం తెలిసిందే కార్మికులను ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి చేర్చుకోవలని జేఏసీ పిలుపునివ్వడం జరిగింది. కార్మికులు ఈ రోజు ఉదయాన్నే విధుల్లో చేరేందుకు కార్మికులు డిపో ల 
వద్దకు చేరుకోగానే ప్రభుత్వం నుండి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని మీకు అనుమతి లేదంటూ కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. 

Related Posts