YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

బలపరీక్షకు ముహర్తం.. బుధవారం సాయంత్రం 5గంటలకు

బలపరీక్షకు ముహర్తం.. బుధవారం సాయంత్రం 5గంటలకు

బలపరీక్షకు ముహర్తం..
బుధవారం సాయంత్రం 5గంటలకు
న్యూఢిల్లీ, నవంబర్ 26 
మహారాష్ట్ర పొలిటికల్ గేమ్‌పై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.. బలపరీక్షకు ముహూర్తం ఖరారైపోయంది. బుధవారం సాయంత్రం 5 గంటలలోపు బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. 
వెంటనే ప్రొటెం స్పీకర్‌ను నియమించాలని.. బలపరీక్షను కూడా ప్రత్యక్ష ప్రసారం చేయాలని జస్టిస్ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సూచించింది. బలపరీక్షకు సంబంధించిన ఓటింగ్‌ రహస్యంగా నిర్వహించాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. బలపరీక్షకు ముందే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరగాలని సూచించింది.సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వాగతించారు. బుధవారం జరిగే బలపరీక్షలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఎన్సీపీ కూడా స్పందించింది.. బలపరీక్షలో గెలవగల సంఖ్యాబలం తమకు ఉందని.. సుప్రీంకోర్టు తీర్పు మైలు రాయి లాంటిదని.. బీజేపీ పని అయిపోయిందని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.288 అసెంబ్లీ సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ 105 స్థానాల్లో గెలిచింది. శివసేన 56 సీట్లు దక్కగా.. ఎన్సీపీ 54, కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 145 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. బీజేపీకి 11 మంది ఇండిపెండెంట్ల మద్దతు ఉండగా.. మరో 29 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.ఇటు సోమవారం సాయంత్రం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు.. 162 మంది ఎమ్మెల్యేలతో బల ప్రదర్శనకు దిగాయి. గ్రాండ్ హయత్ హోటల్‌‌ ముందు ఎమ్మెల్యేలు పరేడ్ చేపట్టారు. గ్రాండ్ హయత్‌లో ఎమ్మెల్యేలందరూ సమావేశం కాగా.. ఈ భేటీకి శివసేన నేతలు ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే.. ఎన్సీపీ నేతలు శరద్ పవార్, సుప్రియా సూలే హాజరయ్యారు. తాము ఎలాంటి ప్రలోభాలకు గమని మూడు పార్టీల ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు.సోనియా హర్షంమహారాష్ట్ర అసెంబ్లీలో దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఐదు గంటల్లోగా బలనిరూపణ చేసుకోవాలని సుప్రీం కోర్టు చ్చిన తీర్పును కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ స్వాగతించారు. సుప్రీం కోర్టు తీర్పు రిత్రాత్మకమని అభివర్ణించారు. బలపరీక్షలో విపక్షాలదే విజయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.ఇక సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని శివసేన పేర్కొంది. ఇది ప్రజాస్వామ్య విజయమని తెలిపింది. సుప్రీం ఉత్తర్వులతో శివసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీం తీర్పు అనంతరం ఖేల్‌ ఖతం అంటూ ఆ పార్టీ నేత నవాబ్‌ మాలిక్‌ ట్వీట్‌ చేశారు.మేమే గెలుస్తాం : శరద్ పవార్మహారాష్ట్ర రాజకీయాల విషయంలో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ సూత్రాలను సుప్రీంకోర్టు పరిరక్షించినందుకు నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌.. న్యాయస్థానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భారత రాజ్యాంగ దినోత్సవం నాడు మహారాష్ట్ర రాజకీయాలపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. భారతరత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌కు పవార్‌ నివాళులర్పించారు.మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారం సాయంత్రం 5 గంటల్లోపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ట్వీట్‌ చేశారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలతో రాజకీయాలపై సాధించిన విజయం ఇది అని ఆమె పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం రోజున సుప్రీం ఇచ్చిన తీర్పు మహారాష్ట్ర ప్రజలకు కానుక అని తెలిపారు. ఓపెన్‌ బ్యాలెట్‌ పద్ధతిన బలపరీక్ష నిర్వహించడం శుభపరిణామం అన్నారు. మహారాష్ట్రలో సత్యమే వర్ధిల్లుతుంది. జై హింద్‌, జై మహారాష్ట్ర అని సుప్రియా సూలే ట్వీట్‌ చేశా

Related Posts