ఇసుకతో వారానికి 63 కోట్లు
విజయవాడ, నవంబర్ 26
టీడీపీనేతలు, అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ట్విట్టర్ వేదికగా ప్రతిపక్షంపై నిప్పులు చెరిగారు.. ఇసుక పేరుతో టీడీపీ హయాంలో డబ్బు దోచేస్తే..జగన్ ప్రభుత్వం మాత్రం వారంలోనే రూ.63కోట్లు ఆదాయం తెచ్చిందన్నారు. టీడీపీ పాలనలో ఇసుక ద్వారా వచ్చిన రాబడి ఎవరి జేబుల్లోకి వెళ్లిందని ప్రశ్నించారు. అలాగే ముఖ్యమంత్రి జగన్ అవినీతీ నిర్మూలనకు తీసుకున్న నిర్ణయం సాహసోపేతమని.. దేశంలోనే తొలిసారి ఆయన అవినీతిపై ర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసిన ఘనత దక్కుతుందన్నారు.వారం రోజుల్లోనే ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి 63 కోట్ల ఆదాయం వచ్చింది. సంవత్సరమంతా చూస్తే ఇది వేల కోట్లలోకి వెళ్తుంది. మరి ఇన్నాళ్లు ఈ రాబడి ఎవరి జేబుల్లోకి వెళ్లింది. పచ్చ ఇసుక మాఫియా ద్వారా మీకూ వాటా ముట్టేది. అందుకే ఇసుక కొరతపై ఇంత రాద్ధాంతం చేశారు.దేశంలోనే ప్రథమంగా అవినీతిపై ఫిర్యాదుల కోసం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి 14400 కాల్ సెంటర్‌ను ప్రారంభించారన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ. ఇటువంటి సాహసం ఇప్పటి వరకు ఏ రాష్ట్రం చేయలేక పోయిందని.. ఎవరు లంచం అడిగినా, డబ్బులివ్వందే పని జరగదని చెప్పినా ఫోన్ చేయొచ్చు అన్నారు. చెప్పడమే కాదు చేసి చూపారు జగన్ గారు అంటూ ప్రశంసలు కురిపించారు.