YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ విదేశీయం

అమెరికాలో హైద్రాబాద్ అమ్మాయి రేప్, హత్య

అమెరికాలో హైద్రాబాద్ అమ్మాయి రేప్, హత్య

అమెరికాలో హైద్రాబాద్ అమ్మాయి రేప్, హత్య
హైద్రాబాద్, నవంబర్ 26 
అమెరికాలో మరో ఘోర ఘటన వెలుగుచూసింది. శుక్రవారం నుంచి కనిపించకుండా పోయిన 19ఏళ్ల రూత్‌ జార్జ్‌పై సోమవారం శవమై కనిపించింది. ఆమెపై అత్యాచారం చేసి దారుణంగా చంపేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆమె చదువుతున్న కాలేజీ వెనుకున్న నిర్మానుష్య ప్రాంతంలోనే విద్యార్థిని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతురాలి స్వస్థలం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ కావడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.హైదరాబాద్‌కు చెందిన దంపతులు చాలా ఏళ్ల క్రితం అమెరికాకు వలస వెళ్లి ఇల్లినాయిస్‌లో స్థిరపడ్డారు. వారి కుమార్తె రూత్ జార్స్(19) యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌లో ఆనర్స్ చదువుతోంది. శుక్రవారం యూనివర్శిటీకి వెళ్లి రూత్ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. సోమవారం ఆమె మృతదేహం యూనివర్శిటీ వెనుకనున్న ప్రాంతంలో కనిపించింది.పోస్టుమార్టం రిపోర్టులో ఆమెపై అత్యాచారం చేసి చంపేసినట్లు వెల్లడి కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. అందులో ఓ వ్యక్తి రూత్‌ను బలవంతంగా యూనివర్శిటీ వెనక్కి లాక్కెళ్తున్నట్లు స్పష్టంగా రికార్డయింది. నిందితుడిని డొనాల్డ్ తుర్మన్ అనే వ్యక్తిగా గుర్తించి చికాగోలో అరెస్ట్ చేశారు. అతడిపై అత్యాచారం, హత్య కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Related Posts