YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

బుధవారం పీఎస్ఎల్వీ సీ 47 ప్రయోగం 

బుధవారం పీఎస్ఎల్వీ సీ 47 ప్రయోగం 

బుధవారం పీఎస్ఎల్వీ సీ 47 ప్రయోగం 
నెల్లూరు, నవంబర్ 26 
కౌంట్‌డౌన్ ప్రారంభమయ్యింది. మంగళగవారం ఉదయం మొదలైన కౌంట్‌డౌన్.. 26 గంటలపాటూ కొనసాగనుంది. బుధవారం ఉదయం 9.28 గంటలకు నింగిలోకి రాకెట్ దూసుకెళ్లనుంది. పీఎస్ఎల్వీ-సీ47 రాకెట్ 14 ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది. కార్టోశాట్-3తో పాటూ అమెరికాకు చెందిన ఉపగ్రహాలను.. పీఎస్‌ఎల్వీ-సీ47 నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కార్టోశాట్-3ని ఇస్రో రూపొందించింది. కార్టోశాట్-3 జీవిత కాలం ఐదేళ్లు కాగా.. కార్టోశాట్-3 ఉపగ్రహం బరువు 1625 కిలోలు.. ఉపగ్రహం  తయారీకి రూ.350కోట్లు ఖర్చు అయ్యింది. ఇటు పీఎస్‌ఎల్‌వీ సీ-47 ప్రయోగం నేపథ్యంలో.. ఇస్రో చైర్మన్ శివన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పీఎస్‌ఎల్‌వీ   సీ-47 ప్రయోగం విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.ఇస్రో సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి ఇమేజింగ్‌ వ్యవస్థలున్న కార్టోశాట్‌-3ని ప్రయోగిస్తోంది. పాక్   భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులకు సహకరించిన రిశాట్‌ శ్రేణికి మించిన సామర్థ్యం ఈ ఉపగ్రహాలకు ఉన్నట్లు ఇస్రో తెలిపింది. మూడో తరం ఉపగ్రహంగా భావిస్తున్న కార్టోశాట్‌-3 25 సెం.మీ. హై రిజల్యూషన్‌తో ఫోటోలను తీయగలదు. సైనిక, ఉగ్రవాద స్థావరాలను మరింత స్పష్టంగా చూపగలదు.పీఎస్‌ఎల్‌వీ-సీ47 ద్వారా ప్రయోగించే ఈ ఉపగ్రహాన్ని  భూమికి 509 కిలోమీటర్ల స్థిర కక్ష్యలో, 97.5 డిగ్రీల కోణంలో ఉంచేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే నవంబరు 25న ఉదయం 9.28  గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ47 రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి సూర్యుని స్థిర కక్ష్యలోకి పంపుతారు. కార్టోశాట్‌-3తోపాటు అమెరికాకు చెందిన ఎన్‌ఎస్‌ఐఎల్‌ సహకారంతో రూపొందించిన 13  
వాణిజ్య నానో ఉపగ్రహాలనూ ప్రయోగిస్తారు.

Related Posts