YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

భర్తను బుక్ చేసేసిన భార్య

భర్తను బుక్ చేసేసిన భార్య

భర్తను బుక్ చేసేసిన భార్య
గాంధీనగర్, నవంబర్ 26
ఆఫీసులో పనిచేసే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుందో ఇల్లాలు. హోటల్‌ రూమ్‌లో ప్రియురాలితో రాసలీలలు సాగిస్తుండగా భర్తకు షాకిచ్చింది.  వారిద్దరిని పోలీసులకు పట్టించి తగిన బుద్ధి చెప్పింది. గుజరాత్‌లోని  హ్మదాబాద్‌కు చెందిన మేశ్సెక్రటేరియట్‌లో గ్రూప్-2 ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. తన ఆఫీసులోనే పనిచేసే ఓ వివాహితతో కొన్నాళ్లుగా అక్రమ సంబంధం నడుపుతున్నాడు.  భర్త ప్రవర్తనలో మార్పులు రావడాన్ని గమనించిన రమేశ్ భార్య అతడిపై నిఘా పెట్టింది. ఆమె విచారణలో భర్తకు మరొక మహిళతో అక్రమ సంబంధం ఉందని తేలడంతో అతడికి ఎలాగైనా బుద్ధి  చెప్పాలనుకుంది. రెండ్రోజుల క్రితం ఆఫీసు పనిమీద వడోదర వెళ్తున్నానని చెప్పి రమేశ్ భార్యకు చెప్పాడు.సూట్‌కేసు సర్దుకుని బయటకు వెళ్లిన భర్తను ఆమె ఫాలో అయింది. భర్త వడోదరలోని నర్మదా గెస్ట్‌హౌస్‌కి వెళ్లడం, అక్కడ ప్రియురాలితో ఓ గది తీసుకోవడం మొత్తం గమనించింది. వెంటనే మహిళా పోలీసులకు సమాచారం ఇచ్చింది. భర్త, ప్రియురాలు గదిలో రాసలీలల్లో మునిగి తేలియాడుతున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు రమేశ్‌, అతడి ప్రియురాలిపై కేసు నమోదు  చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Related Posts