YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

సెటిల్మెంట్లకు అడ్డగా పోలీస్ స్టేషన్లు

సెటిల్మెంట్లకు అడ్డగా పోలీస్ స్టేషన్లు

సెటిల్మెంట్లకు అడ్డగా పోలీస్ స్టేషన్లు
హైద్రాబాద్, నవంబర్ 26,
క్కువ కాలంలో ఎక్కువ సంపాదన కోసం రాజకీయనేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ల్యాండ్ సెటిల్మెంట్లపై దృష్టిసారించారు.  ఇటీవల గత కొంతకాలంగా జిల్లాలో సెటిల్మెంట్ల దందా జోరుగా సాగుతున్నది. బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నప్పటికీ వారికి పూర్తిస్థాయిలో న్యాయం జరగడంలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ల్యాండ్ సెటిల్మెంట్ల వ్య వహారంలో పరోక్షంగా  పోలీసుల ప్రమేయం ఉండడం వల్లే తమకు న్యాయం జరగడంలేదని బాధితులు విచారం వ్యక్తం చేస్తున్నారు.  ఇటీవల కొన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో జరిగిన ఉదంతాలే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.చౌదరిగూడ మండలంలోని గుర్రంపల్లి గ్రామానికి చెందిన నర్సింహులు రైతుకు 138 సర్వే నెంబర్‌‌లో 2 ఎకరాల భూమి ఉంది. ఈయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే ఆ రెండేకరాల భూమిని తనకు విక్రయించాలని పోలీసులతో ఒక రాజకీయ నాయకుడు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా మంగళవారం, బుధవారం తండ్రితో పాటు కుమారులను పోలీసు స్టేషన్‌‌లో   ఉంచి భయబ్రాంతులకు గురిచేశారు.ఇదే చౌదరిగూడ పోలీసుస్టేషన్‌‌లో పనిచేసే ఓ కానిస్టేబుల్ పద్మారం  గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద భూ సమస్య పరిష్కారిస్తామని లంచం తీసుకున్నారు. ఈవిషయం బహిర్గతం కావడంతో అతడిపై వేటు వేశారురాజేంద్రనగర్‌‌ నియోజకవర్గ పరిధిలో  2.06 ఎకరాల భూమిలో వివాదంలో ఉంది. ఈ భూమిపై ఓ రాజకీయ నాయకుడు కన్నెడు.  ఆ వి షయంలో  తమకు అనుకూలంగా ఉండే రాజేంద్రనగర్‌‌ పోలీస్‌‌ స్టేషన్‌‌కు చెందిన ఓ అధికారికి ఫోన్‌‌ చేశాడు.   వివాదం ఉన్న భూమిలో ప్రహారి గోడలు నిర్మించుకుంటున్న వ్యక్తులను పిలిపించి సదరు రాజకీయనేతకు భూమిని అమ్మాలని పోలీస్ అధికారి  సూచించారు. దీంతో వారు ఏమీ సమాధానం చెప్పలేకపోవడంతో  ప్రహారి గోడల నిర్మాణాలను నిలిపివేశారు.   సంబంధించిన వ్యక్తులను స్టేషన్కు  పిలించి  సెటిల్‌‌మెంట్ చేశారు.సిటీ  శివారు  హయత్‌‌నగర్‌‌ మండలానికి చెందిన ఒక  చిన్న రైతుకు ఉన్న  భూమిని తనకు  విక్రయించాలని  స్థానిక రాజకీయ నాయకుడు అడిగాడు. అందుకు ఆ రైతు స్పందించకపోవడంతో  సదరు నేత  పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు సైతం రైతును ఒప్పించేందుకు ప్రయత్నించారు.  ఆ రైతు భూమి విజయవాడ హైవే పక్కనే ఉండడంతో నాయకుడి కన్ను పడింది.ఘట్ కేసర్ మండలం పరిధిలో 25 ఎకరాల భూమి విషయంలో పోలీసులు గ్రేటర్ లోని ఓ ముఖ్య రాజకీయ నేతకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఆ భూమికి నలుగురు హక్కు దారులు ఉండగా,  ఒక హక్కుదారుడి నుంచి భూమి మొత్తాన్ని ప్రభుత్వ పెద్దల్లో ఒకరికి కుడి భుజంగా వ్యవహరించే సదరు ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల పేరిట కొనుగోలు చేశారు. ఇందుకోసం ఒక వ్యక్తికే 38 ఈ సర్టిఫికెట్ ఇప్పించి అతడి నుంచి భూమి కొనుగోలు చేశారు. దీని పై మిగతా రైతులు అభ్యంతరం చెప్పినప్పటికీ  మూడు రోజుల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిపించేశారు.గచ్చిబౌలిలోని ఓ పోలీసు అధికారి కూతురు రియల్‌‌ వ్యాపారం చేస్తోంది.  సంగారెడ్డి జిల్లా ముత్తంగి వద్ద 2.7 ఎకరాల  భూమి అమ్మకానికి ఉన్నట్లు గుర్తించారు. ఈ భూమికి హక్కుదారు లైన అబూబకర్‌‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. గడువులోగా అబూబకర్‌‌కు డబ్బులు ఇచ్చేందుకు ఆమె నిరాకరిస్తుంది. ఈ నేపథ్యంలో అబూబకర్‌‌ ఇదే భూమి అదే ధరకు మరో రియల్‌‌ వ్యాపారికి విక్రయించారు. దాంతో  పోలీసులతో అబూబకర్‌‌, అహ్మద్‌‌లను నార్సింగ్‌‌ పోలీస్‌‌ స్టేషన్‌‌ కు పిలిపించి  బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం.

Related Posts