YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వరంగల్ లో రాజ్యాంగ దినోత్సవం

వరంగల్ లో రాజ్యాంగ దినోత్సవం

వరంగల్ లో రాజ్యాంగ దినోత్సవం
వరంగల్ అర్బన్,
పేద, బడుగు, బలహీన వర్గాలకు ఉపయోగపడే విధంగా డా.బి.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ధాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. భారతదేశం అనేక సంవత్సరాలు బ్రిటీష్ పాలనలో కొనసాగినందున, ఆ కాలంలో ప్రజల హక్కులకు, స్వేచ్చా జీవితానికి నోచుకోలేదని గుర్తుచేశారు. అదే సమయంలో త్యాగమూర్తుల త్యాగ ఫలితంగా భారతదేశానికి 1947లో స్వారాజ్యం సిద్దించిందని తెలిపారు. నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ ధాస్యం వినయ్ భాస్కర్, కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి మంగళ వారం హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ సమీపంలోని డా.బి.ఆర్. అంబ్కేర్ విగ్రహానికి పులమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాల్గొన్న పలువురితో రాజ్యాంగ విలువలతో కూడిన ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సువాశాలమైన భారత దేశానికి ప్రజలందరికి సమన్యాయం కలుగడానికి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు పలువురు విద్యావేత్తలు, న్యాయ నిపుణులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు డా.బి.ఆర్.అబేద్కర్ నేతృత్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద భారతదేశ ప్రజాస్వామ్యదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించారని అన్నారు.  
డా.బి.ఆర్.లంబేద్కర్  ఆలోచనలకు అనుగుణంగా చిన్న రాష్ట్రాలతోనే దేశ అభివృద్ధి అన్న నివాధంలో  తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కే.సి.ఆర్. నేతృత్యంలో పోరాడి సాధించుకున్నామని అన్నారు. సాధించుకున్న తెలంగాణను  అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చుటకు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా విన్నూత పథకాలను  అన్ని వర్గాల ప్రజలు ఆర్ధికంగా అభివృద్ధి చెందాడానికి కృషి చేస్తారన్ని తెలిపారు. ప్రజలందరు పండుగలను సంతోషంతో జరుపుకొనుటకు రాష్ట్రంలో నూతన వస్త్రాలను పంపీణీకి శ్రీకారం చుట్టారని చెప్పారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరికి వాధ్య,వైద్యం అవసరమని గ్రహించిన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అందరికి అందించాడానికి వేల కోట్ల రూపాయలను ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు. భారతదేశ రాజ్యాంగంలో తెలిపిన దేశ సమైక్యత, సమగ్రతలను ప్రతి ఒక్కరు గుర్తెరిగి, గౌరవించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా టిఎన్ జివో  అధ్యక్షులు రాజేష్ గౌడ్, కార్పొరేటర్లు వీరగంటి రవిందర్, వి.శ్రీనివాస రావు, పి.విధ్యాసాగర్, వివిధ వర్గాలకు చెందిన నాయకులు,ప్రతినిధులు పాల్గొన్నారు.   

Related Posts