YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఫడ్నవిస్ రాజీనామా 

ఫడ్నవిస్ రాజీనామా 

ఫడ్నవిస్ రాజీనామా 
ముంబాయి
బుధవారం మహరాష్ట్ర రాజకీయాలు పలు మలుపులు తిరిగాయి. బలం నిరూపించుకోవాలంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో హైడ్రామా  పతాక స్థాయికి చేరింది. డిప్యూటీ సీఎం పదవికి ఎన్సీపీ నేత అజిత్ పవార్ రాజీనామా చేసిన కొద్ది సేపటికే సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా అదే బాటలో పయనించారు. అంతకుముందు అయన మీడియాతో మాట్లాడారు. శివసేనపై నిప్పులు చెరిగారు. మహారాష్ట్ర ప్రజలు మహాయతి (బిజెపి-శివసేన కూటమి)కే పట్టం కట్టారని చెప్పారు. బిజెపి ప్రభుత్వానికి ప్రజామోదం ఉందని ఆయన అన్నారు. శివసేన కంటే బిజెపికే ఎక్కువ స్థానాలు లభించాయని చెప్పారు. బలాబలాలు చూశాకా శివసేన బేరాలకు దిగిందని ఆయన అన్నారు. శివసేనకు సిఎం పోస్టు ఇస్తామని ఎన్నికలకు ముందు ఎక్కడా వాగ్దానం చేయలేదు. పొత్తు కుదిరాకా శివసేన మోసం చేసింది. ఎన్నికలకు ముందు శివసేనకు సీఎం పదవి ఇస్తామని ఎలాంటి హామీ ఇవ్వలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని మేము అడిగినప్పుడు వాళ్లు నిరాకరించారు. హాస్యాస్పదంగా శివసేన తమకే మెజారిటీ ఉందంటూ చెప్పుకొచ్చింది. కానీ ఒక్క పార్టీ కూడా బలం నిరూపించుకోలేదు. అందుకే రాష్ట్రపతి పాలన వచ్చిందని  పేర్కొన్నారు.

Related Posts