అవినీతి కాల్ సెంటర్ కు వర్ల రామయ్య ఫోన్
అమరావతి
వర్లరామయ్య, అవినీతి పై ఫిర్యాదులకు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన 14400 కి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మంగళవారం కాల్ చేసారు. జగన్ అక్రమార్జన పై అధ్యయనం చేయాలని టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేసారు. వై.ఎస్ హయాంలో తండ్రి అధికారం అడ్డంపెట్టుకుని జగన్ వేల కోట్లు సంపాదించారని ఫిర్యాదు
జగన్ రాజకీయ అవినీతిపైనా ఐఐఎం అధ్యయనం చేయాలి. ఫిర్యాదును సచివాలయం తీసుకెళ్లి ఎవరైనా అధికారులకు ఇవ్వాలని కాల్ సెంటర్ సిబ్బంది సూచించారు. సీఎం ప్రకటించినట్లుగా నా ఫిర్యాదు పైనా 15రోజుల్లో చర్యలు తీసుకోవాలి. తనపై 43వేల కోట్ల రూపాయల అభియోగాలు పెట్టుకుని అవినీతిని అంతమొందిస్తా అని జగన్ ఎలా చెప్తారని అయన ప్రశ్నించారు. తన పై తానే అధ్యయనం చేయించుకుంటానని సీఎం స్వచ్ఛందంగా ముందుకు రావాలని అయన అన్నారు.