YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఇన్సెంటివ్ లకు దూరంగా వైసీపీ పక్క చూపులు చూస్తున్న ఐటీ కంపెనీలు

ఇన్సెంటివ్ లకు దూరంగా వైసీపీ పక్క చూపులు చూస్తున్న ఐటీ కంపెనీలు

ఇన్సెంటివ్ లకు దూరంగా వైసీపీ
పక్క చూపులు చూస్తున్న ఐటీ కంపెనీలు
విశాఖపట్టణం,
విశాఖ నగరాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యం అంటూ గత ప్రభుత్వం ఊదరగొట్టింది. విశాఖలో ఐటీ రంగాన్ని ప్రోత్సహించడమే కాకుండా, సిలికాన్ వాలీ తరహాలో విశాఖను సిలికానాంధ్రగా తీర్చిదిద్దుతామని గొప్పగా ప్రకటించారు. విశాఖలో ఈ రంగం వేళ్లూనుకోవాలంటే ఐటీ కంపెనీలను ఆకర్షించడంతో పాటు సంస్థలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చిన కంపెనీలకు చిన్నాచితకా రాయితీలు ఇవ్వాలని నిర్ణయించారు. అప్పటి ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత విశాఖలో ఐటీ కంపెనీలు నెలకొల్పే సంస్థలకు ఉదారంగా భూములు సైతం ఇచ్చారు. భూములు పొందకుండా కంపెనీల ఏర్పాటుకు అనువైన నిర్మిత ప్రాంతాన్ని సమకూర్చేందుకు సైతం గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనిలో భాగంగానే సుమారు మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనాలు నిర్మించడం, కొన్ని భవనాలను లీజుకు తీసుకుని ఐటీ కంపెనీలకు కేటాయించింది. అద్దె మొత్తంలో 50 శాతం మొత్తాన్ని ప్రభుత్వం రాయితీగా ప్రకటించింది కూడా. దీనితో పాటు ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తే అందుకు ప్రతిగా ఒక్కో ఉద్యోగానికి సంవత్సరానికి రూ.లక్ష ఇనె్సంటివ్‌ను ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. ఏడాది పాటు ఒక ఉద్యోగికి పీఎఫ్ ఇతర అలవెన్సులతో కూడిన జీతం చెల్లించినట్టు ఆధారాలు పొందుపరిస్తే రూ.లక్ష రాయితీ కంపెనీలకు చెల్లించాలన్నది నిర్ణయం. గత ప్రభుత్వ హామీ మేరకు 2018 జూన్ నాటికి ఉద్యోగాలు కల్పించిన సంస్థలు రాయితీల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో కొన్ని సంస్థలు ఈ రాయితీలను అనుభవించాయి. అదే ఏడాది చివరి నాటికి రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చేయడంతో ఐటీ పరిశ్రమకు రాయితీల హామీ మరుగున పడిపోయింది. ఎన్నికల అనంతరం 2019లో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టడం జరిగిపోయింది. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కొత్త ప్రభుత్వం ఐటీ రాయితీలు కొనసాగిస్తుందని భావించిన ఐటీ కంపెనీలకు ఊహించని షాక్ తగిలింది. ఈ ఏడాది జూన్ నుంచి పూర్తిగా ఈ విధానాన్ని ఉపసంహరించుకున్నట్టే భావిస్తున్నారు. ఏడాది పూర్తి కావస్తున్న తరుణంలో పాత బకాయిలతో పాటు కొత్త ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.40 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. పరిశ్రమల శాఖతో పాటు ఐటీ శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఐటీ సంస్థలకు చెల్లించాల్సిన ఇనె్సంటివ్ తదితర బకాయిలపై స్పందించారు.ఐటీ రంగానికి చెల్లించాల్సిన బకాయిలపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదన్నట్టుగా వ్యాఖ్యానించారు. రాయితీలు, ఇనె్సంటివ్‌ల విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను ఆమూలాగ్రం పరిశీలించిన మీదటే చెల్లింపులు జరుగుతాయని స్పష్టం చేశారు. దీంతో విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించిన పలు ఐటీ సంస్థలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డాయి

Related Posts