YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

వామ్మో..భయోడైవర్శిటీ ఫ్లైఓవర్

వామ్మో..భయోడైవర్శిటీ ఫ్లైఓవర్

వామ్మో..భయోడైవర్శిటీ ఫ్లైఓవర్
రంగారెడ్డి, నవంబర్ 27,
బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై అతివేగం, అన్యుహ మలుపు, కారణంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు ట్రాఫిక్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఫ్లై ఓవర్‌పై వేగంగా వెళుతున్న వాహన చోదకులు ఎదురుగా ఉన్న మలుపును అంచనా వేయలేక పోవటంతో స్పీడ్ గార్డులను దాటుకుని నిస్సాన్ షోరూమ్ ఎదురుగా బోల్తా పడినట్లు గుర్తించామన్నారు. ఇదిలావుండగా రూ. 69.47 కోట్ల రూపాయలతో 900 మీటర్ల పోడువుతో నిర్మించిన భారీ వంతెనలో మలుపుల కారణంగా అతివేగంగా వచ్చే కార్లు అదుపు చేయలేక పోతుండటం విచారకరం. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్‌పై గంటకు 14 వేల వాహనాలు నడిచే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.రహదారుల్లోని కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఇబ్బంది లేకుండా హైటెక్ సిటీ వైపు సాఫిగా ప్రయాణం చేసేందుకు నిర్మించిన ఈ ఫ్లై ఓవర్‌లో నెలలోపే రెండు విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇదే ఫ్ల ఓవర్‌పై సెల్పీ మోజులో ఉన్న ఇద్దరు యువకులు ఈ నెల 9వ తేదీన అర్ధరాత్రి ప్రమాద బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా శనివారం నాడు ఓ సాప్ట్‌వెర్ ఇంజనీర్ అతివేగం కారణంగా సత్యవేణి అనే మహిళ మృత్యువాత పడింది. కాగా ఈ వంతెనపై వేగం గంటకు 40 కిమీ మించరాదని, అయితే వాహన చోదకులు అతివేగంగా కారును నడుపుతున్నట్లు రహదారి భద్రత నిపుణులు పేర్కొంటున్నారు. అదేవిధంగా ఫ్లై ఓవర్ మధ్య భాగంలో చాలా ఎత్తుగా ఉండటంతో నగరంలోని వివిధ ప్రాంతాలు కనిపిస్తుండటంతో చాలా మంది సెల్పీలు, ఫోటోల కోసం యత్నిస్తున్నట్లు గుర్తించారు.ట్రాఫిక్ కష్టాలను అధికమించేందుకు నిర్మించిన బయోడైవర్సిటి ఫ్లై ఓవర్ నిర్మిస్తే ప్రారంభించిన 19 రోజులకే వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. కాగా ఫ్లైఓవర్ బ్రిడ్జి మలుపు కింద ఓ భారీ వృక్షం కారణంగా ప్రమాదంలో మృతుల సంఖ్య తగ్గిందని చెప్పవచ్చు. ఫ్లైఓవర్ పై నుంచి కింద పడిన వాహనాలు నేరుగా చెట్టుపై పడటంతో ప్రమాదంలో పలువురు స్వల్పగాయాలతో బయపడ్డారు. చెట్టు కొమ్మల గుండా కారు కిందపడటం వల్ల ప్రమాద శాతం తగ్గిందని రహదారి భద్రత నిపుణులు పేర్కొంటున్నారు.ఫ్లై ఓవర్ కింది భాగంలో రాయదుర్గం బస్‌స్టాప్ వద్దే తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు ట్రాఫిక్ విభాగం అధికారులు వివరిస్తున్నారు. అయితే ఫ్లై ఓవర్ కింద భారీ చెట్టు ఉన్న కారణంగా ఫ్లై ఓవర్‌పై అదుపు తప్పిన వాహనాలు నేరుగా చెట్టుపై పడి ఆ తరువాత కింపడుతున్నాయి. ఈక్రమంలో శనివారం మధ్యాహ్నం కారు ప్రమాదంలోనూ కారు నేరుగా చెట్టుపై పడి తరువాత కిండ పడింది. దీంతో కారు పల్టీలు కొట్టిన కారణంగా, కారు విడిభాగాలు చెల్లాచెదురుగా పడటం వల్ల క్షతగాత్రుల సంఖ్య పెరిగినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొంటున్నారు.ఈ వంతెనపై మొదటి సారి ప్రమాదంతో ట్రాఫిక్ పోలీసులు పలు చర్యలు తీసుకున్నారు. ఫ్లై ఓవర్ పై వాహనాలు అపవద్దుని, లౌడ్ స్పీకర్ల ద్వారా అనౌన్స్ చేస్తున్నారు. వంతెన పై ప్రత్యేకంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి ఎక్కడ అయిన వాహనాలు అగితే వారికి అక్కడ ఏర్పాటు చేసిన మైక్‌ల ద్వారా అనౌన్స్ చేస్తున్నారు. అలాగే స్పీడ్ గన్స్‌తో పాటు సూచిక బోర్డులు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. పాదచారులకు అనుమతి లేని ఈ వంతెన పై నిరంతర పర్యవేక్షణ ఉన్నప్పటికీ స్పీడ్‌కు కళ్లెం వేయలేక పోతున్నారు. కార్లు, ఇతర వాహనాలు ద్విచక్ర వాహనాలకు కేటాయించిన లైనులోనే కార్లను నడుపుతున్నారు. నిబంధనలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.ఫ్లై ఓవర్ ప్రమాదంలో కారును నడుపుతున్న కృష్ణమిలాన్‌రావు ( 35 ) తలకు, కుడి చెవి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం కేర్‌ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఐసియులో వైద్యుల చికిత్సలు అందిస్తున్నారు. ఇక అనంతపురానికి చెందిన యువతి కుబ్రా(23) ఛాతి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఆటోడ్రైవర్ బాలూ నాయక్(38)ఎడమ కాలిపాదం పూర్తిగా దెబ్బతినడంతో ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు చికిత్స చేస్తున్నారు.కృష్ణ మిలాన్‌రావు  రాయదుర్గం వైపు నుంచి తన వోక్స్ వ్యాగన్ కారు(టిఎస్ ఇడబ్ల్యూ5665)లో బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ నుంచి మైండ్ స్పేస్ వైపుగా వస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పింది. దీంతో వంతెన పై నుంచి నిషాన్ షో రూం ఎదురుగా ఉన్న చెట్టును ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకు 105 కిమీ వేగంతో ప్రయాణిస్తోంది. అదే సమయంలో చెట్టు కింద ఆటోస్టాండ్ ఉండటం, ఆటోడ్రైవర్లతో పాటు మరో 12 మంది చెట్టుకింద నిలబడి బస్సు కోసం ఎదురు చూస్తున్నారు.ఫ్లైఓవర్‌పై వేగంగా ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి కిందికి దూసుకొచ్చింది. అదే సమయంలో బస్సు కోసం వేచి ఉన్న సత్యవేణిపై కారు పడటంతో ఆమె తల, ఛాతీ భాగాలు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. బస్సు కోసం వేచి చూస్తున్న వారిపై కారు మృత్యువు రూపంలో దూసుకొచ్చింది. కూతురి కళ్ల ఎదుటే కన్న తల్లి ప్రాణాలు వదిలిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తల్లి మృతిచెందడం, ఆమె కుమార్తె ప్రణీత స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడటంతో ఆ కుటంబంలో విషాదఛాయలు అలుమకున్నాయి.

Related Posts