YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 టీపీసీసీ కోసం నేతల ప్రయత్నాలు

 టీపీసీసీ కోసం నేతల ప్రయత్నాలు

 టీపీసీసీ కోసం నేతల ప్రయత్నాలు
నల్గొండ, నవంబర్ 27,
కాంగ్రెస్‌లో కొత్త రచ్చ మొదలయింది. పిసిసి చీఫ్ పదవి కేంద్రంగా నేతల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమంటున్నాయి. పిసిసి అధ్యక్షుడిన మారుస్తారనే వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు మరోసారి తారాస్థాయికి చేరాయి. ఎవరికి వారు తామే పిసిసి అధ్యక్షులుగా ఎంపిక కాబోతున్నామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అధ్యక్ష పదవి రేసులో తామే ముందున్నామని, హైకమాండ్ కూడా తమవైపే అనుకూలంగా ఉందని చెబుతున్నారు. ఈ పదవిని దక్కించుకునేందుకు నేతలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా వారు పరస్పరం విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వరుస ఓటములతో రాష్ట్రంలో కాంగ్రె స్ కుదేలైంది. ఇలాంటి తరుణంలో నేతల మధ్య కొసాగుతున్న విభేదాలు మరింతగా రచ్చకెక్కుతున్నాయి. దీంతో పార్టీ నేతల మధ్య పిసిసి పదవి సరికొత్త చిచ్చుపెడుతోంది.ఈ రేసులో ప్రధానంగా సిఎల్‌పి నాయకుడు భట్టి విక్రమార్క, మల్కాజ్‌గిరి ఎంపి రేవంత్‌రెడ్డి, ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంగారెడ్డి ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి, పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు తదితరులు ఉన్నారు. ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఉత్తమ్‌కుమార్ రెడ్డిని మార్చడం ఖాయమన్న ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ ఇటీవల జరిగిన హుజూర్‌నగర్ ఉపఎన్నిక ఫలితం కాంగ్రెస్‌కు ఆశనిపాతంగా మారింది. ఎంతో కాలంగా ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోటగా వస్తోంది. ఈ నియోజకవర్గాన్ని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొన్నేళ్ళుగా శాసించారు. అయితే ఉప ఎన్నికల్లో మాత్రం తన భార్య పద్మావతిని గెలిపించుకోలేకపోయారు. ఈ ఓటమి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఈ నేపథ్యంలో పిసిసి చీఫ్‌ను మారుస్తారని గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు ఎవరికి వారుగా తామే పిసిసి ప్రెసిడెంట్ అని ప్రకటనలు చేస్తున్నారు. మరో వారం పది రోజుల్లో పీసీసీ చీఫ్‌ను మారుస్తారని భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నారు. మహారాష్ట్ర పరిణామాల అనంతరం టిపిసిసికి కొత్త పిసిసి రానున్నారని, అందులో తాను ముందు రేసులో ఉన్నట్లు ప్రకటించారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి కూడా తనకే మద్దతిస్తున్నారని ఆయన వెల్లడించారు. తనకు పిసిసి పదవి రాగానే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు. దాని కోసం పార్టీ హైకమాండ్ అనుమతి కోరినట్లు చెప్పారు. మరోవైపు సంగారెడ్డి ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి సైతం తానూ కూడా పిసిసి అధ్యక్షుడి పదవి రేస్‌లో ఉన్నట్లు పలు సందర్భాల్లో వెల్లడించారు. తనకు అవకాశమిస్తే పార్టీ బలోపేతం, ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూనే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని జగ్గారెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. సిఎం పదవి ఆశించడకుండా పార్టీ కోసం పనిచేస్తానని కూడా ఆయన ప్రకటించారు.కాగా ఇందిరా గాంధీ తరహాలోనే సోనియా కూడా బలహీన వర్గాలకు కూడా పిసిసి అధ్యక్ష పదవిని కట్ట బెట్టడంలో ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు డిమాండ్ చేస్తున్నారు. జనాభా ప్రకారం బిసిలకే పిసిసి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో డి. శ్రీనివాస్ (బిసి) పిసిసి అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని విహెచ్ గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆలోచనల్లో కూడా మార్పు రావాలని వ్యాఖ్యానించడం విశేషం. తనకు ప్రజల్లో మంచి పేరుతో పాటు అనుభవం ఉందంటున్నారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు వయసుతో పనిలేదని, 82 ఏళ్ల షీలా దీక్షిత్‌కు పదవి ఇచ్చారని, బిసిల హయాంలోనే కాంగ్రెస్‌లకు లాభం జరిగిందని అంటున్నారు.ఈ విషయంపై త్వరలో తాను సోనియాను కలుస్తానని ఇటీవల పేర్కొన్నారు. ఇక జగ్గారెడ్డి సైతం తాను కూడా పిసిసి అధ్యక్షుడి పదవి రేస్‌లో ఉన్నానని పలు సందర్భాల్లో వెల్లడించారు. తనకు అవకాశమిస్తే పార్టీ బలోపేతం, ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూనే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పారు జగ్గారెడ్డి. కేసీఆర్ పథకాలంటే అద్భుతమైన పథకాలు తన దగ్గర ఉన్నాయన్నారు. సీఎం పదవి ఆశించడకుండా పార్టీ కోసం పనిచేస్తానని జగ్గారెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు రేవంత్‌రెడ్డి కూడా తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికుంచుకోవాలంటే తనలాంటి నేతకు అవకాశం కల్పించాలని ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి విజ్ఞప్తి చేసినట్లుగా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తం మీద పిసిసి అధ్యక్ష ఎంపిక రాష్ట్ర నేతల్లో వాడివేడి చర్చ సాగుతోంది. వారి మధ్య నెలకొన్న అంతర్గత విబేధాలను మరింతగా రాజేస్తున్నాయి. ఈ పరిస్థితి కాంగ్రెస్‌పై మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారుతోం ది. నేతల తీరుపై పార్టీ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉంది. 

Related Posts