YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

దినకరన్ చాప్టర్ క్లోజ్

దినకరన్ చాప్టర్ క్లోజ్

దినకరన్ చాప్టర్ క్లోజ్
చెన్నై, 
టీటీవీ దినకరన్ ఏ ముహూర్తంలో పార్టీని పెట్టారో కాని ఆయన పార్టీకి అన్నీ అపశకునాలే. నియంత ధోరణి, వ్యూహాల లోపంతో టీటీవీ దినకరన్ తనంతట తానుగానే పార్టీని భూస్థాపితం చేసుకుంటున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. అన్నాడీఎంకేలో సజావుగా ఉండి ఉంటే దినకరన్ కు ఇన్ని తిప్పలు ఉండేవి కావు. దినకరన్ జయలలిత తరిమేసిన వ్యక్తి. జయలలిత బతికుండగా దినకరన్ ను పార్టీ కార్యాలయంలోకి రావద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు.అయితే జయలలిత మరణం తర్వాత దినకరన్ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. మేనత్త శశికళ ఆశీస్సులతో దినకరన్ పార్టీ బాధ్యతలు చేపట్టారు. శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లగా పార్టీని నమ్మకంగా నడుపుతారని దినకరన్ పై బాధ్యతలు మోపింది. అయితే పళనిస్వామి ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి దినకరన్ ఆయనకు తలనొప్పిగా తయారయ్యారు. మంత్రివర్గంలో చీలిక తెచ్చే ప్రయత్నం చేశారు.దీంతో పళనిస్వామి అప్పటి వరకూ తనను వ్యతిరేకించిన పన్నీర్ సెల్వం కంటే దినకరన్ డేంజర్ అని గుర్తించి ఆయనను పార్టీ నుంచి బయటకు పంపేశారు. ఈ నేపథ్యంలోనే ఆర్కే నగర్ ఉప ఎన్నికలో గెలిచిన దినకరన్ అదే ఊపుతో సొంత పార్టీ పెట్టారు. దినకరన్ వెంట నడిచిన ఎమ్మెల్యేలందరిపైనా అనర్హత వేటు పడింది. పార్టీని తమ చేతుల్లోకి తెచ్చుకుంటారన్న నమ్మకంతో దినకరన్ వెంట అప్పట్లో నడిచిన ఎమ్మెల్యేలు తిరిగి పార్టీని వీడటం మొదలుపెట్టారు. దినకరన్ వైఖరి సక్రమంగా లేకనే తాము పార్టీని వీడి వెళ్లిపోతున్నట్లు చెబుతున్నారు.పార్టీలో సీనియర్ నేతగా ఉన్న పుగళేంది కూడా పార్టీని వీడారు. పార్టీ సమాచార అధికార ప్రతినిధిగా ఉన్న పుగళేంది తిరిగి అన్నాడీఎంకేలో చేరారు. ఆయన పార్టీని వీడటానికి కారణం దినకరన్ ఒంటెత్తుపోకడలేనని చెబుతున్నారు. ఇప్పటికే దినకరన్ పార్టీ నుంచి సీనియర్ నేతలు సెంథిల్ బాలాజీ, తంగ తమిళ్ సెల్వన్, కలైరాజన్ లు పార్టీని వీడి వెళ్లిపోయారు. వీరంతా ప్రతిపక్ష డీఎంకేలో చేరారు. అయితే ఇటీవల ఉప ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో అన్నాడీఎంకే గెలవడంతో ఆ పార్టీలోకి కూడా వలసలు ప్రారంభమయ్యాయి. దినకరన్ కు ఇక కష్టాలు తప్పేట్లు లేవు. ఇదంతా దినకరన్ స్వయంకృతాపరాధమే.

Related Posts