YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ విద్యాసంస్థ

హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ విద్యాసంస్థ

ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసుకుని అంతర్జాతీయ వేదికపై సత్తా చాటుకోవాలని ఆకాక్షించే విద్యార్థులకు ఐఎంఎఫ్‌ఎస్(ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఫారీన్‌ స్టడీస్‌) అత్యంత సహాయకారి అని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ ఘంటా చక్రపాణి అన్నారు. దేశ వ్యాప్తంగా సేవలు అందిస్తున్న ఐఎంఎఫ్‌ఎస్ నూతన శాఖను కూకట్‌పల్లి సర్ధార్‌ పటేల్‌నగర్‌లో ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఎంఎఫ్‌ఎస్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించడం సంతోషకరమన్నారు. అనంతరం తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ అంతర్జాతీయంగా విద్యారంగంలో ఉన్న ప్రముఖ సంస్థలు, విద్యాలయాల గురించి మెరుగైన సమాచారం వల్ల విద్యార్థులు మరింత అభివృద్ధిని సాధించవచ్చన్నారు. ఈ సంస్థ ద్వారా ప్రొఫెషనల్‌ కోచింగ్‌, ఎడ్యూకేషనల్‌ లోన్స్‌, వీసా అప్లికేషన్లు, మాక్‌ ఇంటర్వ్యూలు, వీసా ప్రక్రియలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఎఫ్‌ఎస్ వ్యవస్థాపకుడు ప్రొ.కేపి.సింగ్‌, సినీనటుడు నాగేంద్రబాబు, హైదరాబాద్‌ బృందం అజయ్‌కుమార్‌, రాఘవేంద్ర, గౌతమ్‌మూర్తి తదితరులు హాజరయ్యారు.

Related Posts