YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

పవర్ కోసం పవార్

పవర్ కోసం పవార్

పవర్ కోసం పవార్
ముంబై, 
శరద్ పవార్… సీనియర్ నేత. ఆయనకు రాజకీయాల్లో మరో పేరు జిత్తుల మారి. తనకు రాజకీయ పాఠాలు నేర్పిన నేతనే పక్కన పెట్టి పార్టీని చీల్చిన ఘనత శరద్ పవార్ ది. ఇప్పుడు శరద్ పవార్ మహారాష్ట్ర రాజకీయాల్లో కేంద్రబిందువుగా మారారు. శివసేన పూర్తిగా శరద్ పవార్ వ్యూహాలపైనే ఆధారపడి ఉంది. శరద్ పవార్ చెప్పినట్లుగానే శివసేన ప్రతి అడుగు వేస్తుంది. ఆయన చెప్పిన వ్యూహాన్ని అమలు చేస్తుంది. నిన్న జరిగిన మహా పరేడ్ కూడా శరద్ పవార్ ఆలోచనే.శరద్ పవార్ కు మరాఠా యోధుడిగా పేరుంది. ఆయన 27 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి 38 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి కాగలిగారు. సోనియాగాంధీ విదేశీయతను సయితం ప్రశ్నించిన తొలి నేత శరద్ పవార్. అలాంటి సోనియా సారథ్యంలోని కాంగ్రెస్ కు శరద్ పవార్ దగ్గరయ్యారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని మరాఠా రాజకీయాల్లో అనేక సార్లు మలుపులు తిప్పిన నేతగా పేరుగాంచారు. అటువంటి శరద్ పవార్ బీజేపీకి షాకిచ్చి అజిత్ పవార్ ను తిరిగి వెనక్కు రప్పించగలిగారు. గేమ్ ప్లాన్ లో సక్సెస్ అయ్యారు.అజిత్ పవార్ ఎన్నికలకు ముందు కొంత అసహనం ప్రదర్శించారు. వెంటనే శరద్ పవార్ ఆయన ఇంటికి వెళ్లి మరీ మాట్లాడి వచ్చారు. తమ కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవని అప్పట్లో శరద్ పవార్ ప్రకటించారు. ఇప్పుడు మాత్రం కుటుంబంలో విభేధాలంటున్నారు. నిజానికి శరద్ పవార్ సీరియస్ గా శివసేన, కాంగ్రెస్ లతో కలసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే ప్రధాని నరేంద్ర మోదీని ఆ సమయంలో కలవరు. మహారాష్ట్ర ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత కలిసేవారు. శరద్ పవార్ మోదీని కలవడం ఎన్సీపీలోనూ తప్పుడు సంకేతాలు వెళ్లాయనే చెప్పాలి. అందుకే అజిత్ పవార్ బీజేపీ వెంట వెళ్లారంటున్నారు.79 ఏళ్ల వయస్సులోనూ శరద్ పవార్ మరాఠా రాజకీయాలను శాసించాలనుకుంటారు. అయితే శరద్ పవార్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఎవరికీ అర్థం కాదు. లాస్ట్ మినిట్ వరకూ ఎలాంటి వ్యూహం రచిస్తారన్నది సొంత పార్టీ నేతలకు అంతుచిక్కదు. పైకి కూటమి వైపు గట్టిగా నిలబడినట్లు కన్పించి అజిత్ పవార్ వెంట వెళ్లిన ఎమ్మెల్యేలను తిరిగి తన గూటికి రప్పించుకోగలిగారు. అజిత్ పవార్ ను కట్టడి చేయడంలో శరద్ పవార్ విజయం సాధించారు. అజిత్ పవార్ చేత రాజీనామా చేయించడం కూడా శరద్ పవార్ రాజకీయ అనుభవానికి ఒక నిదర్శనం.  బీజేపీనీ మానసికంగా దెబ్బ కొట్టారు శరద్ పవార్. అందుకే ఫడ్నవిస్ రాజీనామా చేయాల్సి వచ్చింది. బీజేపీ బలపరీక్షకు ముందే వెనక్కు తగ్గింది
ఇవాళే ఉద్ధవ్ ప్రమాణం
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా 28 తేదీన ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబయిలోని శివాజీ పార్కులో ప్రజలు, అభిమానుల మధ్య ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టబోతున్నారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలసి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్ధవ్ థాక్రేను ఎన్నుకున్నారు. డిప్యటీ సీఎం పదవిని కాంగ్రెస్, ఎన్సీపీలు పంచుకోనున్నాయి. చెరి రెండున్నరేళ్లు డిప్యూటీ సీఎం బాధ్యతలను పంచుకోనున్నారు. ఎన్సీపీ నేత జయంత్ పాటిల్, కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలా సాహెబ్ లు ఉండనున్నారు.. ప్రొటెం స్పీకర్ గా కాళిదాస్ కొలంబ్కర్ ను గవర్నర్ ఎంపిక చేశారు. ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. ట్రడెంట్ హోటల్ లో సమావేశమైన శివసేన కూటమి నేతలు ఈరోజు రాత్రికి గవర్నర్ ను కలవనున్నారు.

Related Posts