YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

కారు బీభత్సం…. ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు  ప్రాణాలు తీస్తున్నఅతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ : హైదరాబాద్

కారు బీభత్సం…. ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు  ప్రాణాలు తీస్తున్నఅతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ : హైదరాబాద్

కారు బీభత్సం…. ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు
 ప్రాణాలు తీస్తున్నఅతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్
హైదరాబాద్ నవంబర్ 27  
ఎల్బీనగర్ ఎన్. టి ఆర్ నగర్  సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటమ్మ , సత్తెమ్మ అనే ఇద్దరి మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంకటమ్మ పరిస్థితి విషమంగా వుంది. దిల్ సుఖ్ నగర్ - ఎల్బీనగర్ ప్రధాన రహదారిపై అతివేగంగా దూసుకవచ్చిన కార్ రోడ్డు దాటుతున్న ఇద్దరిని ఢీ కొట్టింది. తరువాత పల్టీలు కొట్టి మెట్రో డివైడర్ ను గుద్దుకుంది. ఈ ఘటన సినిమా షూటింగ్ ను   తలపించిందని స్థానికులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఓజోన్ హాస్పిటల్  కు తరలించారు. బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ ప్రమాదం మరిచి పోకముందే..మళ్ళీ అదే తరహా ప్రమాదం జరిగింది. ప్రమాదం లో గాయపడిన వెంకటమ్మ , సత్తెమ్మ ఇద్దరూ కూడా అక్కచెల్లెళ్లు. బుధవారం ఉదయమే తమ బంధువు  చావుకు వెళ్తున్న 
సమయం లో రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరూ  జింకల బావి కాలనీ లో నివాసం ఉంటున్నారు. 

Related Posts