ప్రైవేటు ట్రావెల్ బస్సు దగ్దం...ప్రయాణికులు క్షేమం
ఒంగోలు నవంబర్ 27
ప్రకాశం జిల్లా కనిగిరి మండలం లింగారెడ్డిపల్లి వద్ద తప్పిన ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. పామూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రకాశం జిల్లా కనిగిరి మండలం లింగారెడ్డిపల్లె వద్దకు రాగానే ఆయిల్ ట్యాంకర్ లీకైంది. ఇది గమనించిన డ్రైవర్ ..బస్సు నిలిపివేసి ప్రయాణికులను కిందకు దింపాడు. ప్రయాణికులు దిగిన కొద్దిసేపటికే మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో పదిహేను మంది ప్రయాణికులు ఉన్నారు.