విశాఖపట్నంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్(వీఎస్‌పీ)... 14 మేనేజ్‌మెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...చక్కటి జీతంతో మేనేజ్మెంట్ ట్రైనీ విభాగంలో ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తున్నారు..శిక్షణలో మరియు శిక్షణ అనంతరం జీతబత్యాలలో వ్యత్యాసం కలదు.. వివరాలలోకి వెళ్తే..
పోస్టు: మేనేజ్‌మెంట్ ట్రైనీ(ఎంటీ).
వేతనం: శిక్షణలో రూ.20,600; ఉద్యోగంలో నియమితులయ్యాక రూ.24,900-రూ.50,500.
విభాగాల వారీ ఖాళీలు: హెచ్‌ఆర్-8, మార్కెటింగ్-6.
అర్హతలు: సంబంధిత విభాగాలను బట్టి కనీసం 60శాతం(ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ-50శాతం) మార్కులతో ఎంబీఏ/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా. అలాగే యూజీసీ నెట్(జూలై -2018) నిర్ణీత స్కోర్‌తో ఉత్తీర్ణత.
వయసు: 2018, ఫిబ్రవరి 1 నాటికి 27 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్లు వర్తిస్తాయి.
శారీరక ప్రమాణాలు : ఎత్తు-పురుషులు కనీసం 150 సెం.మీ, మహిళలు కనీసం 143 సెం.మీ ఉండాలి. బరువు-పురుషులు కనీసం 43 కిలోలు, మహిళలు కనీసం 35 కిలోలు ఉండాలి. అలాగే తగినంత శారీరక, మానసిక ఆరోగ్యం, దృఢత్వం ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ.
దరఖాస్తు రుసుం: జనరల్/ఓబీసీ-రూ.500; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ-రూ.100. రుసుముకు 18శాతం జీఎస్‌టీ అదనంగా చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తుల ప్రారంభం: జూన్ 25, 2018.
దరఖాస్తు చివరి తేదీ: జూలై 16, 2018.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్:www.vizagsteel.com