YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

 ధాన్యం అమ్మిన రైతులకు వెంటనే చెల్లింపులు చేయాలి

 ధాన్యం అమ్మిన రైతులకు వెంటనే చెల్లింపులు చేయాలి

 ధాన్యం అమ్మిన రైతులకు వెంటనే చెల్లింపులు చేయాలి
-  జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి
వనపర్తి నవంబర్ 27  
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం అమ్మిన రైతులందరికీ వెంటనే చెల్లింపులు చేయాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి నిర్వాహకులను ఆదేశించారు.  బుధవారం ఆమె గోపాల్పేట, రేవల్లి మండలాలలోని వివిధ గ్రామాలలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు.  ముందుగా జిల్లా కలెక్టర్ గోపాల్పేట మండలం తాడిపర్తి గ్రామంలో ఐకేపీ ద్వారా ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడ రైతులు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, అధికారులతో మాట్లాడారు. తాడిపర్తి కొనుగోలు కేంద్రానికి గత సంవత్సరం వచ్చిన ధాన్యం వివరాలు, ఈ సంవత్సరం కేంద్రం పరిధిలో పండించిన వరి, హంస, సోనామసూరి, వివరాలను రైతుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. తాడిపర్తి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం పరిధిలో సుమారు 350 ఎకరాలలో పండించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చేందుకు అవకాశం ఉందని, మొత్తం 30 లారీల వరకు ధాన్యం వస్తుందని, ఇప్పటివరకు 10 లారీల దాన్యం వచ్చిందని రైతులు తెలిపారు.45 మంది రైతులు ఇప్పటివరకు కొనుగోలు కేంద్రానికి దాన్యం తీసుకువచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ధాన్యం వివరాల రిజిస్టరు, ట్రక్ సీటు, ,ట్యపుల ద్వారా ఇప్పటి వరకు నమోదు చేసిన రైతుల వివరాలు, రైస్ మిల్లుల ట్యాగింగ్, రైతులకు చేసిన చెల్లింపుల వివరాలను కలెక్టర్ పరిశీలించారు.
    ఇప్పటివరకు ఏ రైతుకు కూడా చెల్లింపులు చేయలేదని తెలుసుకున్న కలెక్టర్ జిల్లా పౌరసరఫరాల అధికారి, డి ఆర్ డి ఓ ఇతర అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెండింగ్లో ఉన్న చెల్లింపులు అన్నింటిని ఈనెల 28 లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. ట్యాపులలో రైతుల వివరాల నమోదు, ధాన్యం అమ్మిన రైతులకు బిల్లుల చెల్లింపు విషయంలో ఆలస్యం చేయవద్దు అని ఆదేశాలు జారీ చేశారు.
     అనంతరం జిల్లా కలెక్టర్ గోపాలపేట మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన, అలాగే చెన్నూరు గ్రామంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, “ట్రక్ సీట్, ధృవీకరణ చేసిన విస్తీర్ణం ఇతర వివరాలను అడిగారు.
ట్రాన్స్ పోర్ట్, ట్రక్కు షీట్, రైస్ మిల్లుల ట్యాగింగ్, పరిశీలించారు. పౌరసరఫరాల జిల్లా మేనేజర్ పరిధిలో పెండింగ్ ఉండడం పట్ల, జాప్యం లేకుండా క్లియర్ చేయాలని ఆదేశించారు.        అనంతరం జిల్లా కలెక్టర్ రేవల్లి మండలం చెన్నారం గ్రామంలో ఐకేపీ ద్వారా ఏర్పాటుచేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఇప్పటివరకు ఈ కేంద్రానికి 67 మంది రైతులు దాన్యం తీసుకురాగా, పదిమందికి చెల్లింపులు చేశామని,ట్యాపులో 45 మంది రైతుల వివరాలను చేయడం జరిగిందని, ట్రక్ సీట్లు 25 వరకు పెండింగ్ ఉన్నాయని , రైస్ మిల్లుల ట్యగింగ్ ఆలస్యం అవుతుందని కలెక్టర్ గమనించారు. రైస్ మిల్లుల ట్యాగింగ్ జాప్యం చేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.  జాయింట్ కలెక్టర్ డి. వేణు గోపాల్, డి ఆర్ డి ఓ గణేష్, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ లక్ష్మయ్య, డి.ఎస్.ఒ రేవతి, డి సి ఓ కోదండ రాములు ,గోపాల్పేట తాసిల్దార్ నరేందర్, ఎంపీడీవో దత్తాత్రేయ, ఏ పీ ఎం వెంకన్న, తాడిపర్తి సర్పంచ్ పద్మ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

Related Posts