ఆర్టీసీ సమ్మె వేతనాలపై హైకోర్టు విచారణ
బుధవారానికి వాయిదా
హైదరాబాద్ నవంబర్ 27
ఆర్టీసీ కార్మికుల సెప్టెంబర్ నెల జీత భత్యాల పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. పేమెంట్ ఆఫ్ వేజేస్ యాక్ట్ 7 ప్రకారం ఒక్క రోజు విధులు హాజరు కాకుంటే, 8 రోజుల జీతం కట్ చేయచ్చు. కార్మికులు యాభై రెండు రోజులుగా సమ్మె లోనే ఉన్నారు. పేమెంట్ ఆఫ్ పేజెస్ ప్రకారం కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించలేమని ప్రభుత్వం వాదించింది. ప్రభుత్వం జీతాలు చెల్లించక పోవడం వల్ల అనేక మంది కార్మికులు రోడ్డున పడ్డాయని పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనను వినిపించారు. తక్షణమే ప్రభుత్వం సెప్టెంబర్ నెల జీతాలు కార్మికులకు చెల్లించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. జీతాల చెల్లింపు పై పలువురు సుప్రీంకోర్టు తీర్పులను కోర్ట్ ముందు వుంచారు. తదుపరి విచారణను కోర్టు వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.