మద్య నిషేధం అమలు చేస్తున్న మహిళలు
సంగారెడ్డి నవంబర్ 27
మద్యం సేవించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని, ఆర్థికంగా నష్టపోతున్నారని మద్య నిషేధానికి నడుంబిగించారు ఆ గ్రామ మహిళలు. ఆ గ్రామంలోని మహిళలందరూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మద్య నిషేధంగ్రామంలో అమలు చేసి తీరాల్సిందే అని తీర్మానించుకున్నారు. అమ్మిన వారికి కొన్న వారికి జరిమానా విధించాలని నిర్ణయించుకున్నారు. తమ తీర్మానాన్ని ఆ గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సర్పంచ్మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని వార్డు సభ్యులతో సహా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇంకేముంది మద్యపాన నిషేధం అమలులోకి వచ్చేసింది. బెల్టుషాపులు మూతబడ్డాయి. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం ఎర్రారం గ్రామం లో బెల్ట్ షాపుల్లో మద్యాన్ని విక్రయిస్తున్నారు. ఆ గ్రామంలోని పెద్దవాళ్లు, యువత కూడా మద్యాన్ని సేవిస్తూ తమ పనులకు వెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలు. మద్యం సేవించడం వల్ల ఆరోగ్యం పాడవడంతో పాటుకుటుంబంలో గొడవలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. ఆర్థికంగా కూడా తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఎన్ని సార్లు చెప్పి చూసిన ఫలితం లేకపోవడంతో, తీర్మానం చేసిమద్య నిషేధం అమలు చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు గ్రామ మహిళలు. గ్రామంలో మద్యం అమ్మకాలను నిషేధానికి గ్రామపంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేశారు. మద్యాన్ని అమ్మినా, కొన్నా జరిమానాలు విధించాలని నిర్ణయించుకున్నారు. బెల్టుషాపులు వెంటనే మూసివేయాలని నోటీసులు పంపించారు. మద్యం అమ్మినవారికి 25 వేల జరిమానా, కొన్న వారికి పదివేల జరిమానా, విధించాలని తీర్మానం చేశారు. అమ్మినట్లు గాని, కొన్నట్లు గాని ఎవరైనా సమాచారం ఇస్తే వారికి ఐదు వేల బహుమానం కూడా ఇస్తామని తెలిపారు ఆగ్రామస్తులు. ఎర్రారం గ్రామంలో యువత మద్యానికి బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని అన్నారు ఆ గ్రామ సర్పంచ్. తమ గ్రామ ప్ర గ్రామ మహిళలు వచ్చి మద్య నిషేధం అమలుచేయాలని కోరడం సంతోషంగా ఉందని అన్నారు. గ్రామం లో మధ్య నిషేధం అమలు చేసే విధంగా గ్రామస్తులు ప్రతిజ్ఞ కూడా చేశారు. అందరూ పాటించాలని ఎవరు అతిక్రమించిన జరిమానా తప్పదని హెచ్చరిస్తున్నారు గ్రామస్తులు. బెల్టు షాపులకు మద్యాన్ని సరఫరా చేసే వైన్స్ లో కూడా సమాచారం అందించామని అన్నారు ఆ గ్రామ సర్పంచ్. మద్యం విక్రహించకుండా బెల్టుషాపులకు తీర్మాణ నోటీసులు పంపించారు. ఎర్రారం గ్రామంలో మధ్యం అమ్మకాలు నిషేధించడాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఆ గ్రామ మహిళలు అందరికీ ఆదర్శంగా నిర్ణయం తీసుకున్నారని, ప్రతి గ్రామంలో కూడా ఇలా నడుం బిగిస్తే యువత మద్యానికి బానిసకాకుండా భవిష్యత్పై ఆలోచన చేస్తారని అంటున్నారు గ్రామస్తులు. గ్రామ మహిళలు నడుం బిగించడం దానికి పంచాయతీ వార్డు మెంబర్ల తో సహా సర్పంచి ఏకగ్రీవ తీర్మానం చేయడం హర్షణీయం. గ్రామ మహిళల తీర్మానం పూర్తిగాఅమలు కావాలని, మద్య నిషేధం అమలైతే బాగుంటుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.