YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సొమ్ము కేంద్రానిది..సోకు రాష్ట్రానిది...

సొమ్ము కేంద్రానిది..సోకు రాష్ట్రానిది...

సొమ్ము కేంద్రానిది..సోకు రాష్ట్రానిది...
-250 పడకల ఆసుపత్రి నిర్మాణానికి 60 కోట్లు మంజూరు చేసిన కేంద్రం 
-కేసీఆర్ ఘనత అన్నట్లుగా టీఆరెస్ నాయకులు సంబరాలు చేసుకోవడం విడ్డూరం 
-బీజేవైఎం రాష్ట్ర నాయకులు సోల్తి రవికుమార్ 
వరంగల్ రూరల్  నవంబర్27
సొమ్ము కేంద్రానిది సోకు రాష్ట్రానిది అన్న చందంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆరెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని బీజేవైఎం రాష్ట్ర నాయకులు సోల్తి రవికుమార్ మండిపడ్డారు. బుధవారం  పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ లో బీజేవైఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం  జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా  250 పడకల జిల్లాస్థాయి ఆసుపత్రి నిర్మాణం కోసం 60 కోట్ల నిధులు కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సోల్తి రవి కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టుగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిదులు చెప్పుకుంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. నర్సంపేట ఆసుపత్రి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 60 కోట్లు కేసిఆర్ ఇచ్చినట్టు టీఆర్ఎస్ శ్రేణులు  సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సైతం రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా మబ్యపెడుతూ ప్రజలను మోసం చేస్తున్న టీఆరెస్ నాయకులకు, టిఆరెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో లబ్ది కోసమే దగాకోరు రాజకీయాలు చేస్తున్న టిఆర్ఎస్ పార్టీని ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి వడ్డేపల్లి నరసింహ రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి రేసు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కందగట్ల   టాక రాజు , బీజేవైఎం రాష్ట్ర నాయకులు సోల్తి రవి  కుమార్, అర్బన్ ప్రధాన కార్యదర్శులు రంజిత్ కుమార్, రామాంజనేయులు, ఉపాధ్యక్షులు కందకట్ల నాగరాజు, కొంపెల్లి రాజేందర్, మల్యాల సాంబమూర్తి, తాళ్లపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Related Posts