YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జీవో నెంబర్ 142 ను  సవరించాలి.

జీవో నెంబర్ 142 ను  సవరించాలి.

జీవో నెంబర్ 142 ను  సవరించాలి.  
ఎమ్మిగనూరు నవంబర్ 27
ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో స్థానిక చిన్న పత్రికలకు కాలరాసే విధంగా ఉన్న జీవో నెంబర్ 142  ప్రవేశ పెట్టడం వలన జర్నలిస్టుల మనుగడ కష్టసాధ్యం అయ్యే ప్రమాదముందని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరమ్ తాలుక అధ్యక్షులు కె.ఎమ్.డి ఫారూఖ్ డిమాండ్ చేశారు.బుధవారం స్థానిక వై.ఎస్.ఆర్ సర్కిల్ నుండి జర్నలిస్ట్ లు అందరూ ర్యాలీని నిర్వహించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు కె.ఎమ్.డి ఫారూఖ్ మాట్లాడుతూ జీవో నెంబర్ 142  సవరణ చేసి జీ.ఎస్టీ మరియు రోజువారిగా 2000 దిన పత్రికల సర్క్యులేషన్,అక్రిడేషన్ పొందేందుకు సి.ఆర్.డి.ఏ పరిధిలో ఉండాలని నిబంధనలను తొలగించి, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆర్.ఎన్.ఐ కి సమర్పించే వార్షిక రాబడి యొక్క కాపీలో దిన,మధ్య,వార,పక్ష పత్రికలను ముద్రించిన, అమ్మిన కాపీల ప్రచురణ కర్త యొక్క సర్టిఫికెట్, తదితర కొన్ని అంశాలు చిన్న పత్రికల మనుగడకు దెబ్బతీసే విధంగా ఉన్నాయని అందువలన సదరు జీవో 142 రద్దు చేయాలని, లేకపోతే సవరణ చేసి పాత జీవో నెం. 96ను అమలు చేయాలని వారన్నారు.అనంతరం జర్నలిస్టులందరు కలసి స్థానిక ఎమ్మెల్యే స్వాగృహానికి వెళ్లి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు.  జీ.ఓ నెం 142 పై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. జర్నలిస్ట్ ల సమస్యలను సానుకూలంగా పరిష్కారిస్తానని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి హామీ ఇచ్చారు.ఎమ్మిగనూరు జర్నలిస్టులకు ఏ.పీ.జే.ఎఫ్  కేటాయించిన ప్రెస్ క్లబ్ స్థలంలో పక్కాభవన నిర్మాణం ఏర్పాటు చేయాలని, నియోజకవర్గ స్థాయిలో సొంత ఇల్లు లేని జర్నలిస్టులకు సొంత ఇల్లు మంజూరు చేయాలని,ప్రభుత్వం నుండి మంజూరు కాబడిన     సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరమ్ తాలుక సెక్రెటరీ దాస్,కోశాధికారి ఏ.ఈ సత్యనారాయణ, జర్నలిస్ట్ లు లోకేష్, గజేంద్ర,రాజేష్,రాజు, మోహన్, నూర్, వీరేష్,చెన్నయ్య ప్రసాద్, తదితరులు హాజరయ్యారు.

Related Posts