ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడ్ల్యూ జేఎఫ్) ఆధ్యర్యంలో ఈ నెల 26న చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టింది. మంగళవారం ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ని సమాచార శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు విడుదల చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సభ్యులు అంజనేయులు, ఎం.బి నాథన్, కోటి శ్రీనివాసులు, ఖాజా వాలి, తదితరులు పాల్గొన్నారు.